హైదరాబాదీ బాలికకు బంపర్ ఆఫర్.. భారీ స్కాలర్‌షిప్ ఆఫర్ చేసిన అమెరికాలోని కాలేజీ

ABN , First Publish Date - 2022-07-18T13:20:24+05:30 IST

అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్‌షి్‌పతో సీటు సంపాదించారు. మల్కాజిగిరికి చెంది న శ్రీయా లక్కాప్రగడ పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో, డెల్టా కాలేజ్‌లో ఇంటర్‌ చదివారు. అనంతరం డెక్స్‌టె

హైదరాబాదీ బాలికకు బంపర్ ఆఫర్.. భారీ స్కాలర్‌షిప్ ఆఫర్ చేసిన అమెరికాలోని కాలేజీ

హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్‌షిప్‌తో సీటు సంపాదించారు. మల్కాజిగిరికి చెంది న శ్రీయా లక్కాప్రగడ పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో, డెల్టా కాలేజ్‌లో ఇంటర్‌ చదివారు. అనంతరం డెక్స్‌టెరిటీ గ్లోబల్‌ మార్గదర్శకత్వంలో అమెరికాలో ప్రముఖ కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు చేశారు. పలు అంశాల్లో ప్రతిభ చూపిన శ్రీయ.. వెల్లస్లీ కాలేజీలో రూ.2.70 కోట్ల స్కాలర్‌షి్‌పనకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ వెల్లస్లీ కాలేజీలో కంప్యూటర్‌సైన్స్‌ లేదా సైకాలజీలో డిగ్రీ చదివే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మాస్టర్స్‌ కూడా అమెరికాలో పూర్తి చేస్తానని వివరించారు. ఎంఎస్‌ పూర్తయ్యాక.. స్టార్ట్‌పను ప్రారంభిస్తానన్నారు. 


Read more