Hurricane: ప్లోరిడా పౌరులకు యూఎస్ ప్రెసిడెంట్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-29T13:17:08+05:30 IST

ఇయాన్ హరికేన్ నైరుతి ప్లోరిడాను(Florida) వణికిస్తోంది....

Hurricane: ప్లోరిడా పౌరులకు యూఎస్ ప్రెసిడెంట్ హెచ్చరిక

ప్లోరిడా(అమెరికా): ఇయాన్ హరికేన్ నైరుతి ప్లోరిడాను(Florida) వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన(extremely dangerous) తుపాన్ వల్ల గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బిడెన్ పౌరులను హెచ్చరించారు.(US President Joe Biden warns citizens) హరికేన్(Hurricane) ఫ్లోరిడా ద్వీపకల్పంలో తుపాన్ వల్ల భారీ గాలులు, వరదలకు కారణమవుతుందని నివేదికలు చెబుతున్నాయి.తుపాన్ తీరాన్ని తాకడానికి ముందు నైరుతి ఫ్లోరిడాలో 2.5 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించారు.


నైరుతి ఫ్లోరిడాలో కాయో కోస్టాకు సమీపంలో 4వ కేటగిరీ తుఫానుగా మారింది.ఇయాన్ తుపాన్ గురువారం ఫ్లోరిడా తూర్పు తీరం మీదుగా కదులుతున్నప్పుడు శుక్రవారం  ఈశాన్య ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా తీరాలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. తుపాన్ సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.


ఇయాన్ రాష్ట్రంపై తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ చెప్పారు. తుపాన్ సందర్భంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఇయాన్ హరికేన్ మధ్య ఫ్లోరిడా తీరంలో నౌక మునిగిపోయింది.ఈ పడవలో23 మంది వలసదారుల కోసం యుఎస్ కోస్ట్ గార్డ్(US Coast Guard) వెతుకుతున్నట్లు యూఎస్ అధికారి తెలిపారు.

Updated Date - 2022-09-29T13:17:08+05:30 IST