ఇలా అయితే కష్టమే.. బెంబేలెత్తిపోతున్న ఎన్నారైలు!

ABN , First Publish Date - 2022-12-12T12:26:07+05:30 IST

న్యూఇయర్, క్రిస్మస్ సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలంలో జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్న ఎన్నారైలకు విమాన టికెట్ ధరలు షాకిస్తున్నాయి. టికెట్ ధరలు ఏకంగా దాదాపు ఐదు రెట్లు..

ఇలా అయితే కష్టమే.. బెంబేలెత్తిపోతున్న ఎన్నారైలు!

ఎన్నారై డెస్క్: న్యూఇయర్, క్రిస్మస్ సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలంలో జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్న ఎన్నారైలకు విమాన టికెట్ ధరలు షాకిస్తున్నాయి. టికెట్ ధరలు ఏకంగా దాదాపు ఐదు రెట్లు పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో స్వస్థలానికి వెళ్లాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

UAEలోని పాఠశాలలు మూడు వారాల శీతాకాల సెలవులను ప్రకటించేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి వచ్చే జనవరి 2 వరకు పాఠశాలలు మూత పడనున్నాయి. దీంతో చాలా మంది NRIలు.. ఇండియా(UAE-India)కు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదే అదునుగా భావించి విమానయాన సంస్థలు ఫ్లైట్ టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. అక్టోబర్‌లో రూ.6వేలుగా ఉన్న టికెట్ ధర.. ఇప్పుడు తక్కువలో తక్కువ రూ.28వేలకు చేరింది. అది కూడా భారత్‌కు రావాలనుకుంటే మాత్రమే. భారత్ నుంచి తిరిగి వెళ్లాలంటే.. ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన టికెట్ ధరలు జనవరి మధ్య వరకు కొనసాగనున్నందున ప్రయాణికుల ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి.

టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..

ఇండిగో: దుబాయ్ నుంచి కొచ్చికి టికెట్ ధర ర.32,300 (రిటర్న్ టికెట్ ధర రూ.66,100)

స్పైస్‌జెట్: దుబాయ్-కొచ్చి టికెట్ ధర రూ.32,500(రిటర్నట్ టికెట్ ధర రూ.65వేలు)

ఎయిర్ ఇండియా: రూ.36,200గా టికెట్ ధర ఉంది. అదే రిటర్న్ టికెట్ ధర రూ.73,800.

ఇక క ప్రయాణికుడు మాట్లాడుతూ.. ‘నేను దుబాయ్ నుంచి కొచ్చి రావడానికి టికెట్ ధరలను పరిశీలించాను. టికెట్ ధర 1830 దిర్హమ్‌లు (సుమారు రూ.41వేలు) ఉండటం చూసి షాకయ్యా. అదే రిటర్న్ టికెట్‌ ధర చూస్తే 3345 దిర్హమ్‌లు ఉంది. ఈ లెక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఇండియాకు వెళ్లాలంటే తక్కువలో తక్కువ రూ.2.72లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది’ అంటూ పెరిగిన టికెట్ ధరలపై ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-12-12T12:29:00+05:30 IST

Read more