ఈ-వీసాలను పునరుద్ధరించిన భారత్.. 156 దేశాలకు ప్రయోజం!

ABN , First Publish Date - 2022-03-17T02:10:59+05:30 IST

కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్ల క్రితం రద్దయిన ఈ- వీసా విధానాన్ని కేంద్రం ప్రభుత్వం తాజాగా పునరుద్ధరించింది.

ఈ-వీసాలను పునరుద్ధరించిన భారత్.. 156 దేశాలకు ప్రయోజం!

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్ల క్రితం రద్దయిన ఈ- వీసా విధానాన్ని కేంద్రం ప్రభుత్వం తాజాగా పునరుద్ధరించింది. ఫలితంగా..  ఐదేళ్ల కాలపరిమిత గల ఈ-వీసాలు 156 దేశాల ప్రజలకు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. బుధవారం నుంచి వీటిని పునరుద్ధరిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా.. అన్నీ దేశాలకు సాధారణ వీసాల(పేపర్ ఆధారిత) జారీని కూడా ప్రారంభించింది. ఇక పదేళ్ల కాలపరిమితిపై అమెరికా, జపాన్ దేశాల ప్రజలకు గతంలో జారీ అయిన సాధారణ టూరిస్ట్ వీసాలను కూడా కేంద్రం పునరుద్ధరించింది. భారత్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. టూరిస్ట్ వీసా ఉన్న విదేశీయులెవరికీ.. రోడ్డు మార్గం లేదా నదీ మార్గం ద్వారా భారత్‌లో ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. కేవలం ఎయిర్ పోర్టు లేదా.. సముద్ర మార్గంలో మాత్రమే వారు దేశంలో కాలు పెట్టాల్సి ఉంటుంది. ఇక అఫ్ఘాన్ జాతీయులకు ఈ నిబంధనలు ఏవీ వర్తించవని, వారి విషయంలో గతంలో ఉన్న ప్రత్యేక మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.  


Read more