భారతీయులకు గుడ్‌ న్యూస్ చెప్పిన జర్మనీ..

ABN , First Publish Date - 2022-10-02T02:03:36+05:30 IST

జర్మనీ(Germany) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

భారతీయులకు గుడ్‌ న్యూస్ చెప్పిన జర్మనీ..

ఎన్నారై డెస్క్: జర్మనీ(Germany) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వీసా దరఖాస్తు పీజులను తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీర్ఘకాలిక జర్మనీ నేషనల్ వీసాలతో పాటూ షెంజెన్ వీసా ఫీజుల్లో కోత విధించినట్టు పేర్కొంది. ఈ మేరకు ముంబైలోని జర్మనీ ఎంబసీ ట్వీట్ చేసింది. దీని ప్రకారం.. జర్మనీ నేషనల్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ.6 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ల(17 ఏళ్ల లోపువారు) ఫీజు రూ. 3 వేలు. ఇక సవరించిన షెంజెన్ వీసా ఫీజుల ప్రకారం.. పెద్దలకు రూ. 6400, మైనర్లకు రూ. 3200గా నిర్ణయించింది. 


ఏమిటీ నేషనల్(National) వీసా.. ?

సాధారణంగా విద్యా, ఉద్యోగం కోసం జర్మనీకి వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం నేషనల్ వీసాలు జారీ చేస్తుంటుంది. 90 రోజులకు పైబడిన వ్యాలిడిటీతో ఈ వీసా జారీ చేస్తారు. అయితే.. స్టూడెంట్ వీసాలకు సంబంధించిన నిబంధనల్లోనూ జర్మనీ మరో కీలక మార్పు చేసింది. ఇకపై భారతీయ విద్యార్థులు ముందుగా అకడమిక్ అవాల్యుయేషన్ సెంటర్‌లో తమ సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాలని చెప్పింది. ఈ తనిఖీకి సంబంధించి ఆథెంటిసిటీ సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది. 


షెంజెన్(Schengen) వీసా అంటే.. 

షెంజెన్ దేశాల్లో(26 ఐరోపా దేశాలు) పర్యటన కోసం జారీ చేసే విసా ఇది.  90 నుంచి 180 రోజుల కాలపరిమితితో ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసాతో జర్మనీ, ఫ్రాన్స్ తదితర ముఖ్య ఐరోపా దేశాల్లో పర్యటించవచ్చు.


Updated Date - 2022-10-02T02:03:36+05:30 IST

Read more