ఇంత ఘోరమా.. కేవలం ఆ మాటన్నందుకు 20ఏళ్ల యువకుడిని.. 50ఏళ్ల వ్యక్తి..

ABN , First Publish Date - 2022-09-14T01:08:13+05:30 IST

అతడి వయసు 50ఏళ్లు. తప్పు చేస్తే పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వయసున్న అతడే తప్పు చేశాడు. దీంతో వయసులో తన కంటే 30ఏళ్లు చిన్నవాడైన యువకుడు అతడికి మంచి చెడులు చెప్పాడు. ఈ క్రమంలో అతడు ఆగ్రహానికి గు

ఇంత ఘోరమా.. కేవలం ఆ మాటన్నందుకు 20ఏళ్ల యువకుడిని.. 50ఏళ్ల వ్యక్తి..

ఎన్నారై డెస్క్: అతడి వయసు 50ఏళ్లు. తప్పు చేస్తే పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వయసున్న అతడే తప్పు చేశాడు. దీంతో వయసులో తన కంటే 30ఏళ్లు చిన్నవాడైన యువకుడు అతడికి మంచి చెడులు చెప్పాడు. ఈ క్రమంలో అతడు ఆగ్రహానికి గురయ్యాడు. ‘నాకే చెప్పేంత వాడివా’ అంటూ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం మహమ్మారిని కట్టడి చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ను ఉద్యమంలాగా నడిపించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అయితే.. 50ఏళ్ల వయసున్న మారియో ఎన్ అనే వ్యక్తి నిబంధనలను అనుసరించలేదు. పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లిన అతడు.. అక్కడ పక్కనే ఉన్న షాప్‌కు వెళ్లి బీర్ కొనుగోలు చేయబోయాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న 20ఏళ్ల క్యాషియర్.. మాస్క్ ధరించాలని మారియో ఎన్‌కు సూచించాడు. మాస్క్ పెట్టుకోకుంటే.. బీర్ ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు.. క్యాషియర్‌ను గన్‌తో కాల్చి చంపేశాడు. దీంతో ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకోగా.. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా తీర్పు వెల్లడించింది. మారియో ఎన్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.  


Read more