Visa on arrival: యూఏఈ వెళ్లే భారతీయులకు ఈ 4 సందర్భాల్లో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. అవేంటంటే..

ABN , First Publish Date - 2022-10-06T17:24:18+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లే 70 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ (Visa on arrival) సౌకర్యం ఉంటుంది.

Visa on arrival: యూఏఈ వెళ్లే భారతీయులకు ఈ 4 సందర్భాల్లో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. అవేంటంటే..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లే 70 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ (Visa on arrival) సౌకర్యం ఉంటుంది. ఇక గల్ఫ్ దేశాల పౌరులకు యూఏఈ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. వారికి ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. కనుక యూఏఈ వెళ్లే 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉన్న 70 దేశాలతో పాటు జీసీసీ దేశాల వారికి వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మిగత దేశాల వారికి తప్పనిసరిగా ప్రీ-ట్రావెల్ వీసా కావాల్సిందే. ఇక భారతీయుల విషయానికి వస్తే.. మనోళ్లకు సాధారణ ఇండియన్ పాస్‌పోర్టు (Indian Passport)తో పాటు యూఎస్ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికన్ గ్రీన్‌కార్డు లేదా బ్రిటన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా లేదా ఈయూ నివాస వీసా ఉండాలి. ఈ నాలుగు సందర్భాల్లో మాత్రమే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉంటుంది.  


ఇక ఇలా పొందిన వీసాతో ఆ దేశంలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే మరో 14 రోజుల పాటు వీసా వాలీడిటిని పొడిగించుకునే వెసులుబాటు కూడా వీసాదారులకు ఉంది. ఇలా మొత్తంగా ఆ వీసాపై 28 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చు. అయితే, ఈ వీసా పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే.. వీసాదారుడి పాస్‌పోర్ట్ తప్పకుండా 6 నెలల వాలీడిటిని కలిగి ఉండాలి. అలాగే యూఎస్, ఈయూ, యూకే రెసిడెన్సీ వీసాల గడువు కూడా 6 నెలలు ఉండాల్సిందే. వీసాదారుడు యూఏఈలో కాలుపెట్టినప్పటి నుంచి వాటి గడువులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక వీసా కాస్ట్ వచ్చేసి 14 రోజులకు గాను 120 దిర్హమ్స్(రూ.2,666) ఉంటుంది. మరో 14 రోజులు పొడిగించుకునేందుకు అదనంగా 250 దిర్హమ్స్(రూ.5,554) చెల్లించాలి.  

Updated Date - 2022-10-06T17:24:18+05:30 IST