America: 8 నెలల పాప సహా నలుగురు భారతీయుల కిడ్నాప్.. కాలిఫోర్నియా పోలీసులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-10-05T17:30:36+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

America: 8 నెలల పాప సహా నలుగురు భారతీయుల కిడ్నాప్.. కాలిఫోర్నియా పోలీసులు ఏమన్నారంటే..

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్​లో శనివారం గుర్తు తెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన నలుగురిని అపహరించారు. కిడ్నాప్ అయిన వారిలో ఓ 8 నెలల పసికందు కూడా ఉంది. అపహరణకు గురైనవారిలో జస్దీప్​ సింగ్​, జస్లీన్​ కౌర్, చిన్నారి​ ఆరూహీ ధేరీ, అమన్​దీప్​ సింగ్​ ఉన్నట్లు కాలిఫోర్నియా పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


అయితే, కిడ్నాప్​ జరిగిన ప్రదేశం అనేక రెస్టారెంట్లు, షాపులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల గురించి తెలిసిన వారు అత్యవసర నెంబర్​కు కాల్​ చేసి సమాచారం అందించాలని కోరారు. కాగా, 2019లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన తుషార్ ఆత్రే అనే వ్యక్తి అపహరణకు గురయ్యాడు. అతడిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత తన ప్రియురాలి కారులో మృతిచెంది కనిపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నాప్‌కు గురైన నలుగురి విషయంలో పోలీసులు చాలా చాకచక్యంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Read more