UAE Tourist visa: విదేశీయులకు యూఏఈ బంపరాఫర్.. రూ. 14వేలకే మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా..

ABN , First Publish Date - 2022-09-27T17:01:38+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల వివిధ రకాల కొత్త వీసాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

UAE Tourist visa: విదేశీయులకు యూఏఈ బంపరాఫర్.. రూ. 14వేలకే మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల వివిధ రకాల కొత్త వీసాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్ అవసరం లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా (multi-entry tourist visa) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఈ వీసా విధానాలను ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనాలిటీ, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది. అన్ని దేశాల వారికి ఈ మల్టీ ఎంట్రీ వీసాను ఇవ్వనున్నట్లు ప్రకటించిన అధికారులు.. దీని ఫీజును 650 దిర్హమ్స్(రూ.14,400)గా నిర్ణయించారు. ఇందులో ఆప్లికేషన్ ఫీ: 100 దిర్హమ్స్, వీసా జారీ ఫీజు: 500 దిర్హమ్స్, అథారిటీ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసులకు 50 దిర్హమ్స్ చార్జీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దరఖాస్తుకు అధికారిక వెబ్‌సైట్ లేదా UAEICP స్మార్ట్ యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ వీసాదారులు కంటిన్యూస్‌గా దేశంలో 90రోజుల వరకు బస చేసేందుకు అనుమతి ఉంటుంది. అలాగే మరో 90 రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, బస వ్యవధి అనేది ఏడాదికి 180 రోజులు దాటకుండా ఉండాలి. వీసా జారీ అయిన రోజు నుంచి బస వ్యవధిని లెక్కించడం జరుగుతుందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. 


ఇక ఈ వీసా కోసం విదేశీయులకు కావాల్సిన దృవపత్రాల విషయానికి వస్తే..

1. ఇటీవల తీసుకున్న కలర్ ఫొటో. అది కూడా వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉండాలి.

2. 4వేల దిర్హమ్స్(రూ.88,627) బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు రుజువు

3. ఆరోగ్య బీమా ప్రూఫ్

4. ఏ దేశం నుంచి వచ్చారో దానికి సంబంధించిన విమాన టికెట్. రిటర్న్ టికెట్ కూడా ఉండాలి

5. కనీసం 6నెలల వాలిడిటీతో కూడిన పాస్‌పోర్టు  


Updated Date - 2022-09-27T17:01:38+05:30 IST