భారతీయ విద్యార్థుల విషయమై చైనా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-08-10T13:26:42+05:30 IST

చైనాలో చదువుకుంటూ కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను త్వరలోనే తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా పేర్కొంది.

భారతీయ విద్యార్థుల విషయమై చైనా కీలక ప్రకటన

భారతీయ విద్యార్థులను త్వరలోనే అనుమతిస్తాం

చైనా విదేశాంగ శాఖ వెల్లడి

బీజింగ్‌, ఆగస్టు 9: చైనాలో చదువుకుంటూ కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను త్వరలోనే తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా పేర్కొంది. విదేశాలకు చెందిన విద్యార్థులను దేశంలోకి తిరిగి అనుమతించడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నామని చైనా తెలిపింది. ఇందులో భాగంగా భారత్‌ నుంచి మొదటి బ్యాచ్‌ విద్యార్థులను అనుమతించే ప్రక్రియ మొదలైందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం చెప్పారు. చైనాలో చదువుకుంటున్న సుమారు 23వేల మంది భారతీయులు కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల కిందటే భారత్‌కు తిరిగొచ్చారు.

Read more