Elon Musk: భారతీయ ట్విటర్ ఫ్రెండ్‌ను కలిసిన ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2022-08-23T05:23:10+05:30 IST

పూణెకు చెందిన ప్రణయ్ పాఠోల్(Pranay Pathole) అనే యువకుడు ఇటీవలే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు.

Elon Musk: భారతీయ ట్విటర్ ఫ్రెండ్‌ను కలిసిన ఎలాన్ మస్క్

ఎన్నారై డెస్క్: పూణెకు చెందిన ప్రణయ్ పాఠోల్(Pranay Pathole) అనే యువకుడు ఇటీవలే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రముఖ వ్యాపార వేత్త టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను(Elon Musk) అమెరికాలో కలుసుకున్నాడు. ప్రణయ్, ఎలాన్ మస్క్ ఇద్దరూ ట్విటర్ స్నేహితులు. 2018 నుంచి వారు నిరంతరం టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ట్విటర్ వేదికగానే అప్పుడప్పుడూ సంభాషిస్తున్నారు. ఇక తాను మస్క్ అభిమాననిని ప్రణయ్ తరచూ చెబుతుంటారు. ప్రస్తుతం అతడు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. కాగా.. టెక్సాస్‌లోని మస్క్ గీగా ఫ్యాక్టరీలో ఆయనతో దిగిన ఫొటోను ప్రణయ్ ట్విటర్‌లో చేసి మురిసిపోయాడు. మస్క్‌తో సమావేశం అద్భుతంగా ఉందని, ఆయన ఎంతో వినశీలి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కొన్ని లక్షల మందికి మస్క్ స్ఫూుర్తిదాత అని కామెంట్ చేశారు. 


2018లో ఓ ట్వీట్ ద్వారా మస్క్, పాఠోల్ మధ్య స్నేహం కుదిరింది. ఓ రోజు అతడు టెస్లా కార్లలోని ఆటోమేటిక్ విండ్ స్క్రీన్ వైపర్ల సమస్య  గురించి ట్విటర్‌‌లో మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అయితే.. మస్క్ నుంచి రిప్లై వస్తుందని అతడు అస్సలు అనుకోలేదు. అయితే..ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇవ్వడంలో ముందుండే మస్క్ ప్రణయ్ ట్వీట్‌కు స్పందించారు. అది నిమిషాల వ్యవధిలో.. ! తదుపరి కార్లు మార్కెట్‌లో ప్రవేశపెట్టేనాటికి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అలా వారి మధ్య స్నేహం మొదలైంది. అయితే.. ప్రణయ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమస్. అతడిని దాదాపు 1.8 లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. 

Updated Date - 2022-08-23T05:23:10+05:30 IST