నిజాయితీ చాటిన భారతీయ డ్రైవర్‌.. దుబాయ్‌ పోలీసుల సన్మానం

ABN , First Publish Date - 2022-04-24T16:06:39+05:30 IST

దుబాయ్‌లో అబ్దుల్‌రహీం మొజీందర్ రాజీఫ్ అనే భారతీయ కారు డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నాడు.

నిజాయితీ చాటిన భారతీయ డ్రైవర్‌.. దుబాయ్‌ పోలీసుల సన్మానం

దుబాయ్: దుబాయ్‌లో అబ్దుల్‌రహీం మొజీందర్ రాజీఫ్ అనే భారతీయ కారు డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నాడు. తన కారులో ప్రయాణికులు మరిచి వెళ్లిపోయిన ఓ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ఆ బ్యాగులో కొంత నగదు, పాస్‌పోర్టుతో పాటు ఇతర కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అల్ ఖుసైస్ పోలీసులు అబ్దుల్‌రహీంను ప్రత్యేకంగా సన్మానించారు. మెమొంటోతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు.  అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్‌హలీమ్ ముహమ్మద్ అహ్మద్ అల్ హషిమి.. భారతీయ డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్‌రహీంకు దుబాయ్ పోలీసుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అబ్దుల్‌రహీం మాట్లాడుతూ.. దొరికిన విలువైన వస్తువులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడం లేదా వాటిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు అప్పగించడం ప్రతి ఒక్కరి విధి అని అన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబ్దుల్‌రహీం గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 

Updated Date - 2022-04-24T16:06:39+05:30 IST