దుబాయ్ వెళ్లే భారతీయులకు తీపి కబురు

ABN , First Publish Date - 2022-02-23T13:41:07+05:30 IST

భారత్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లే వారికి గుడ్‌ న్యూస్‌. ఇకపై మన దేశీయులు దుబాయ్‌కు బయలుదేరే ముందు ఇక్కడి విమానాశ్రయాల్లో ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.

దుబాయ్ వెళ్లే భారతీయులకు తీపి కబురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 : భారత్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లే వారికి గుడ్‌ న్యూస్‌. ఇకపై మన దేశీయులు దుబాయ్‌కు బయలుదేరే ముందు ఇక్కడి విమానాశ్రయాల్లో ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈమేరకు కొవిడ్‌ నిబంధనలను సవరిస్తూ దుబాయ్‌ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది భారత్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకూ వర్తిస్తుందని వెల్లడించింది. విమానం ఎక్కడానికి 48 గంటల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్షలో ‘నెగెటివ్‌’ వచ్చి న ధ్రువపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని సూచించింది. కానీ దుబాయ్‌లో దిగగానే పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. 

Updated Date - 2022-02-23T13:41:07+05:30 IST