పాకిస్థానీ ఎయిర్‌లైన్స్ వింత ప్రకటన.. లోదుస్తులు వేసుకోవాలంటూ సిబ్బందికి సూచన

ABN , First Publish Date - 2022-10-01T03:30:36+05:30 IST

పాకిస్థానీ ఎయిర్‌లైన్స్ తాజాగా ఉద్యోగులకు చేసిన సూచన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. విమానంలోని కేబిన్ క్రూ సిబ్బంది.. హుందాగా కనిపించేలా దుస్తులు ధరించకపోవడం వల్ల విమానయాన సంస్థకు చెడ్డపేరు వస్తోందని పేర్కొంది.

పాకిస్థానీ ఎయిర్‌లైన్స్ వింత ప్రకటన.. లోదుస్తులు వేసుకోవాలంటూ సిబ్బందికి సూచన

ఎన్నారై డెస్క్: పాకిస్థానీ ఎయిర్‌లైన్స్ తాజాగా ఉద్యోగులకు చేసిన సూచన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. విమానంలోని కేబిన్ క్రూ సిబ్బంది.. హుందాగా కనిపించేలా దుస్తులు ధరించకపోవడం వల్ల విమానయాన సంస్థకు చెడ్డపేరు వస్తోందని పేర్కొంది. ముఖ్యంగా.. ఇంటర్‌సీటీ విమానాల్లో సిబ్బంది.. హోటళ్లలో నివసించేటప్పుడు, ఇతర సందర్భాల్లో క్యాజువల్ దుస్తులు ధరిస్తున్నారని చెప్పింది. దీనివల్ల.. ఉద్యోగికే కాకుండా.. సంస్థకు కూడా చెడ్డపేరు వస్తోందని చెప్పింది. కాబట్టి.. విధినిర్వహణలో ఉద్యోగులు పాకిస్థానీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా దుస్తులు ధరించాలని చెప్పింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా కూడా.. ఫార్మల్ దుస్తులతో పాటూ లోదుస్తులు కూడా ధరించాలని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇలాంటి సూచనకు కారణమేంటో ఇంకా తెలియరాలేదు.

Updated Date - 2022-10-01T03:30:36+05:30 IST