UAE: ఈ తప్పు అస్సలు చేయకండి.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక!

ABN , First Publish Date - 2022-09-26T16:03:42+05:30 IST

గత కొద్ది రోజులుగా యూఏఈ(UAE)లోని కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్న ఘటనలపై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీరియస్ అయింది. అంతేకాకుండా ప్రజలను హెచ్చరిస్తూ ఆదివారం రోజు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అ

UAE: ఈ తప్పు అస్సలు చేయకండి.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక!

ఎన్నారై డెస్క్: గత కొద్ది రోజులుగా యూఏఈ(UAE)లోని కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్న ఘటనలపై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీరియస్ అయింది. అంతేకాకుండా ప్రజలను హెచ్చరిస్తూ ఆదివారం రోజు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అయింది. కాగా.. ఇంతకూ అక్కడ ఏం జరిగింది? పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎందుకు సీరియస్ అయింది? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మతలబు ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..


విచారణ సందర్భంగా కోర్టులు(Courts).. అవసరాన్ని బట్టి భవనాలు, ముఖ్యమైన ధ్రువపత్రాలు, కార్యాలయాలు తదితరాలకు సీలు(Seals) వేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. తెలిసీ తెలియక ఈ ఆదేశాలను కొందరు అతిక్రమిస్తున్నట్టు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తించింది. దీంతో ఇటువంటి నేరాలపై ప్రజలకు  అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. 



‘ఉన్నతాధికారులు గానీ, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఏదైనా నివాస భవనాలు, ధ్రువపత్రాలు, ఇతర వస్తువులను సీల్ వేసినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితిలో తొలగించరాదు. ఒకవేళ ఎవరైనా సీల్‌ను తొలగించినా దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినా ఫెడరల్ డిక్రీ చట్టం నెం. 30, 2021లోని ఆర్టికల్ 326 ప్రకారం సదరు వ్యక్తులు శిక్షార్హులు. ఈ నేరాలకు పాల్పడితే.. జైలు శిక్షతోపాటు 10వేల దిర్హమ్‌ల(సుమారు రూ.2.21లక్షల) జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది’ అని పేర్కొంటూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం రోజు పోస్టు పెట్టింది.  


Updated Date - 2022-09-26T16:03:42+05:30 IST