వీసాలు రాకపోతే.. వర్సిటీలను ఓమారు సంప్రదించండి.. విద్యార్థులకు కెనడా ఎంబసీ సూచన

ABN , First Publish Date - 2022-08-21T05:10:56+05:30 IST

కెనడా యూనివర్శిటీల్లో రాబయే రోజుల్లో చేర్సాలిన భారతీయ విద్యార్థులు తమకు వీసా రాని పక్షంలో ఓమారు ఆయా యూనివర్శిటీలను సంప్రదించాలని ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం సూచించింది.

వీసాలు రాకపోతే.. వర్సిటీలను ఓమారు సంప్రదించండి.. విద్యార్థులకు కెనడా ఎంబసీ సూచన

ఎన్నారై డెస్క్: కెనడా యూనివర్శిటీల్లో రాబయే రోజుల్లో చేర్సాలిన భారతీయ విద్యార్థులు తమకు వీసా రాని పక్షంలో ఓమారు ఆయా యూనివర్శిటీలను సంప్రదించాలని ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం సూచించింది. వీసా రాని పక్షంలో ఏం చేయాలనే దానిపై యూనివర్శిటీలతో సంప్రదింపులు జరపాలని కోరింది. తమకున్న ప్రత్యామ్నాయాలపై చర్చించాలని తెలిపింది. ఆసాధారణ రీతిలో వీసా దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో ఈ మారు వీసాల జారీలో జాప్యం జరుగుతోందని తెలిపింది. స్టూడెంట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈ ఏడాది బాగా పెరిగిందని రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే ఏకంగా 123500 దరఖాస్తులు అందాయన్నారు. 2019 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తాజా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 55 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్టూడెంట్ పర్మిట్ దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు సగటున 12 వారాలు పడుతోందని న్యూఢిల్లీలోని ఎంబసీ తెలిపింది. అయితే.. భారతీయుల దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు మరింత అదనపు సమయం పడుతోందని తెలిపింది. 


Read more