బ్రిటన్ హోం మంత్రి కీలక వ్యాఖ్య.. మ దేశంలో తక్కువ నైపుణ్యాలున్న వర్కర్లు ఎక్కువ అంటూ..

ABN , First Publish Date - 2022-10-03T03:24:08+05:30 IST

తక్కువ నైపుణ్యాలున్న విదేశీ వర్కర్లు బ్రిటన్‌లో చాలా మంది ఉన్నారని ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రెవర్మెన్ తాజాగా వ్యాఖ్యానించారు.

బ్రిటన్ హోం మంత్రి కీలక వ్యాఖ్య.. మ దేశంలో తక్కువ నైపుణ్యాలున్న వర్కర్లు ఎక్కువ అంటూ..

ఎన్నారై డెస్క్: తక్కువ నైపుణ్యాలున్న విదేశీ వర్కర్లు బ్రిటన్‌లో(Britain) చాలా మంది ఉన్నారని ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రెవర్మెన్(Suella Braverman) తాజాగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో విదేశీ విద్యార్థులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు కూడా ఎక్కువగానే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో వలసలు తగ్గించడమే తమ లక్ష్యమంటూ 2019లో పార్టీ చేసిన ప్రకటనకు నూతన ప్రదాని లిజ్ ట్రస్ కట్టుబడి ఉన్నారని బ్రెవర్మెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత వలసవిధానాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామంటూ మరో మంత్రి క్వాసీ క్వెర్టాంగ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రెవర్మెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌పై వీటి ప్రభావం ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. 


2021 జనవరి నుంచీ అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల కారణంగా.. హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ రంగాల్లోని సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా రంగాల్లో విదేశీ ఉద్యోగులకు కనీస వార్షిక వేతనం 25,600 పౌండ్లు ఉంటేనే వీసాకు అర్హులన్న నిబంధన కారణంగా.. సిబ్బంది కొరత నెలకొంది. దీని ఫలితంగా ఐరోపా నుంచి బ్రిటన్ వచ్చే వారి సంఖ్య తగ్గినప్పటికీ.. వారి స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నారు. దీంతో.. బ్రిటన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 


Read more