ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-09-28T03:28:59+05:30 IST

ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలు ఆరంభించి 10వ సంవత్సరాలు అయిన సందర్బంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలు ఆరంభించి 10వ సంవత్సరాలు అయిన సందర్బంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 40 మంది వాలంటీర్స్ కలిసి ఈ  బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకున్నారు. గత పది సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు.. దాతల సహాయంతో నిర్వహిస్తున్నారు. సుమారు ముప్ఫై మంది వాలంటీర్లు, నలభై మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకలు జరుపేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.


 ఈ బతుకమ్మ సంబరాల నిర్వహణలో సహకరించిన వాలంటీర్లు, దాతలు.. నవీన్ గడ్డం, కమలాకర్  కోలన్, జగన్ మేకల, సాగర్ సిద్ధం, రవీందర్ రెడ్డి చప్పిడి, నగేష్ పుల్లూరు, ప్రబోధ్ మేకల, అల్లే శ్రీనివాస్, షరీష్ బెల్లం కొండా, దయాకర్ కొమురెల్లి, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్ సిల్వెని, ప్రదీప్  రెడ్డి యల్క, బాచి రెడ్డి, వెంకట్ తిరు, సంతోష్ పల్లె, సునీల్ పాక, రాజా రెడ్డి, త్రిషేర్ పెంజర్ల, సుమంత్ చావా, రవికిరణ్ కుంచనపల్లి, ప్రవీణ్ లాల్, శ్రీనివాస్ వెచ్చ, శ్రీనివాస్ కార్ప్, శ్రీనివాస్ అల్లంపల్లి, శ్రీధర్ యంసాని, రామ గౌడ్, నరేందర్ గూడ, వెంకట్ రాముడి, శ్రీకాంత్ సంగిరెడ్డి, శ్రీనివాస్ పటేల్, శశిధర్ మర్రి, విజేందర్ సంతపురి, జయ్ రెడ్డి, వెంకట్ జక్కె, అరవింద్ కే, రాజేష్ ఆది, రమేష్ లోకే, కళ్యాణ్ రామ్ కుసుమ, వీర్ కుమార్ తిక్క, రమేష్ ఆకుల, భాను సామ, త్రినేష్ అందుర్తి ,శేఖర్ ఇండియన్ టిఫిన్స్, బలరాం కొక్కుల, సత్య ప్రకాష్, వినోద్ నీలం, వెంకట్ అక్కేపల్లి, మధు పోలం, వీర రెడ్డి చీరెడ్డి, ప్రకాష్ గుండవేని, విశాల్ శ్రీరాంశెట్టి, ప్రవీణ్ రెడ్డి నల్లూరి, సంతోష్ గడ్డం, ప్రణయ్ పెరుంబుదూర్, అరుణ్ రెడ్డి, శ్రీధర్ మేడిశెట్టి, వంశీ ఆకారపు, వంశీ కనిగంటి, ప్రవీణ్ గోలి, హరీష్ గడ్డం, సుధీర్ రాజన్, స్వరూప్ కరే, వినోద్ పెరురి, స్వప్న తదితరులకు Telanganites of Ireland ధన్యవాదాలు తెలిపారు.  


ప్రాంతాలకు అతీతంగా సుమారు 600 మంది ఈ బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమం మొదలైంది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి .  మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలనే లక్ష్యంతో  Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు ఫేస్ పెయింటింగ్, మేజిక్ షోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన  ఆడపడుచులకు బహుమతి ప్రదానం చేసారు. వచ్చిన అతిథులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్, రాత్రికి రుచికరమైన వంటలు వడ్డించారు.



Updated Date - 2022-09-28T03:28:59+05:30 IST