ఫిన్లాండ్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-04T23:10:09+05:30 IST

ఫిన్లాండ్ తెలుగు సంఘం.. అక్తోబర్ 2న, ఫిన్లాండ్‌లో దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగా నిర్వహించారు.

ఫిన్లాండ్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ఫిన్లాండ్ తెలుగు సంఘం.. అక్టోబర్ 2న, ఫిన్లాండ్‌లో దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్ లోని అన్ని ప్రాంతాల నుండి నాలుగు వందల మంది హాజరవ్వగా, చిన్నారులు, పెద్దలు ఆట పాటలతో, నృత్య ప్రదర్శనలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలుగు వాళ్లతో పాటు, ఫిన్లాండ్‌లోని ప్రజలు కూడా పాల్గొనడం గమనార్హం. ఇంతకు ముందు ఫిన్లాండ్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో మూడు వందల మంది వరకు హాజరయ్యేవారని, కాని ఈ సారి నాలుగు వందలకు పైగా హాజరవ్వడం ఆనందకర విషయమని, మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఫిన్లాండ్‌కు రావడాన్ని తెలియజేస్తున్నదని, ఫిన్లాండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాధ్ పార్లపల్లి, సుబ్రహ్మణ్య మూర్తి ఓలేటి, జ్యొతిస్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచర్ల తెలియజేసారు. ఇంత మందితో కలిసి పండుగ చెసుకుంటుంటే మన వూరిలో, మన ఇంటిలో వున్నట్లే అనిపించిందని, మున్ముందు వెయ్యి మంది పాల్గొనేటట్టు పెద్ద కార్యక్రమాల్ని నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు. 







Read more