Abu Dhabi: అబుధాబిలో టి.ఎఫ్.ఏ అధ్వర్యంలో కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-03T01:25:58+05:30 IST

యు.ఏ.ఇ రాజధాని అబుధాబిలోగల ఐ.యస్.సి.సి ప్రాంగణంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన సంబురాలలో భారతీయ ఎంబసీ సీనియర్ దౌత్యవేత్త డాక్టర్ బాలాజీ కుటుంబ సమేతంగా పాల్గోన్నారు.

Abu Dhabi: అబుధాబిలో టి.ఎఫ్.ఏ అధ్వర్యంలో కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా ఆంక్షల కారణాన గత మూడేళ్ళుగా సాంస్కృతిక, సాంఘిక జీవన స్రవంతికి దూరంగా ఉన్న గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీయులను ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఎనలేని ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా గల్ఫ్ దేశాలలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.


యు.ఏ.ఇ రాజధాని అబుధాబిలోగల ఐ.యస్.సి.సి ప్రాంగణంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్(టీ.ఎఫ్.ఏ) అధ్వర్యంలో జరిగిన సంబురాలలో భారతీయ ఎంబసీ సీనియర్ దౌత్యవేత్త డాక్టర్ బాలాజీ కుటుంబ సమేతంగా పాల్గోన్నారు. కవి, గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ప్రత్యేకంగా వచ్చారు.  భారతదేశం నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అక్కడ పల్లె వాతవారణం పరిమళించింది. దీనికి అదనంగా తెలంగాణ నుండి ప్రత్యేకంగా వచ్చిన ముగ్గురు కళాకారులు విభిన్న తెలంగాణ ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. భార్యాభర్తల జంట నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలైన ఏఎక్స్ ప్రాపర్టీస్, స్కేర్ యార్డ్స్, ఎస్పాకో, అసమ సలోన్, ట్రైకర్ ప్రాపర్టీస్, జిబి హాలిడేస్, అజంతా జువేలర్స్, యల్.ఐ.సి. ఇంటర్నెషనల్‌లను నిర్వహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని గోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాసరావు, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య, లక్ష్మి, సుధ తదితరులు దగ్గరుండి నడిపించారు.





Updated Date - 2022-10-03T01:25:58+05:30 IST