Work From Home ఉద్యోగులకు మంచి కిక్ ఇచ్చే వార్త!

ABN , First Publish Date - 2022-10-13T01:39:45+05:30 IST

Work From Homeతో విసిగిపోతున్న ఉద్యోగులకు పబ్‌లు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తక్కువ మొత్తాన్ని ఛార్జ్ చేస్తూ.. పనిని పబ్ నుంచే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్రకటన చూసి ఉద్యోగులు కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారు.

Work From Home ఉద్యోగులకు మంచి కిక్ ఇచ్చే వార్త!

ఎన్నారై డెస్క్: Work From Homeతో విసిగిపోతున్న ఉద్యోగులకు పబ్‌లు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తక్కువ మొత్తాన్ని ఛార్జ్ చేస్తూ.. పనిని పబ్ నుంచే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్రకటన చూసి ఉద్యోగులు కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారు. ల్యాప్‌టాప్ చేతిలో పట్టుకుని పబ్బులకు క్యూ కడుతున్నారు. పబ్‌లకు వెళ్లి పని చేయడం ఏంటీ? అని ఆలోచిస్తున్నారా? అవును మీరు వింటున్నది నిజమే. అయితే ఆఫర్ ఎక్కడ అమలవుతోంది.. పబ్‌లు ఈ ప్రకటన ఎందుకొచ్చాయనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


కరోనా మహమ్మారి ప్రజల జీవన శైలినే మార్చేసింది. ఏదైనా విషయం గురించి చెప్పాలంటే.. కరోనా ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. అప్పటి వరకు ఆఫీసుకు వెళ్లి పని చేసే చాలా మంది ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసింది. ఇంటి నుంచే ఆఫీస్ పని పూర్తి చేసే పరిస్థితులు తెచ్చింది. తొలుత ఈ మార్పును ఎంజాయ్ చేసిన ఉద్యోగులు.. ప్రస్తుతం బోర్‌గా ఫీలవుతున్నారు. ఒంటరిగా ఇంట్లో నుంచే పని చేయలేక తెగ ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి వారి కోసమే పబ్బులు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. 



కొవిడ్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన యూకేలోని కొన్ని పబ్బులు.. తిరిగి గాడిన పడేందుకు Work From Pub కల్చర్‌ను ప్రవేశపెడుతున్నాయి. వర్క్ ఫ్రం హోంతో ఇబ్బంది పడుతూ.. కొత్తదనాన్ని కోరుకుంటున్న ఉద్యోగులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలను పబ్‌లోనే కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ట్రెండ్‌కు తెరతీసింది బ్రిటన్‌లోని ‘యంగ్’ పబ్ అట. Work From Pub‌లో భాగంగా ‘Work From Play’ ప్యాకేజీలను ప్రకటించిందట. కేవలం 15 పౌండ్లకే(సుమారు రూ.1,300)లకే ఉద్యోగులు పని చేసుకోవడానికి పబ్‌లో ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్‌విచ్, అన్‌లిమిటెడ్ టీ, కాఫీలను అందిస్తోందట. నిజానికి ఈ ట్రెండ్‌కు ‘యంగ్’ పబ్ 2020లోనే తెరతీసిందట. కానీ అప్పట్లో దీనికి అంత పెద్ద ఆధరణ లభించలేదట. కానీ ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం పబ్’ కల్చర్‌కు మొగ్గు చూపిస్తున్నారట. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీలకు దీన్ని విస్తరించిందట. ఈ కొత్త ట్రెండ్‌ను బ్రిటన్‌లోని ఇతర పబ్బులూ అనుసరిస్తున్నాయట. ఫ్రీ వైఫై, పవర్ సాకెట్స్, అన్‌లిమిటెడ్ సాఫ్ట్ డ్రింక్స్‌ను అతి తక్కువ మొత్తంలోనే అందిస్తూ ఉద్యోగుల దృష్టిని ఆకరిస్తున్నాయట. ఇదిలా ఉంటే.. Work From Pub ద్వారా ఎటువంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఏకాగ్రతతో పని చేయగలుగుతున్నామని ఉద్యోగులు కూడా పేర్కొంటున్నారు. 


Read more