ATAI ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-26T21:22:25+05:30 IST

ATAI(ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ ఇన్కార్పొరేటెడ్) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

ATAI ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

ATAI(ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ ఇన్‌కార్పొరేటెడ్) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి, ATAI సభ్యులు,  Wyndham సిటీ కౌన్సిల్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మెల్బోర్న్ వాసులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా జరుపుకోలేక పోయినందుకు ఈ సంవత్సరం ఆడపడుచులు బతుకమ్మ ఉత్సవాల పట్ల చాలా ఉత్సుకతను చూపించారు. 


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడమనేది ATAI ఆశయాలలో ప్రధానమైనది. ఈ తరం చిన్నారులకు తెలంగాణ సంప్రదాయాల గురించి నేర్పితేనే  అది భావితరాలకు అందుతుందనేది ATAI అధ్యక్షుడి అభిప్రాయం. ఈ లక్ష్యం కార్యరూపం దాల్చే దిశగా ATAI ముందుకెళుతోంది. ATAI ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు బతుకమ్మ ఆడటం, పిల్లల కోసం పెయింటింగ్, డ్రాయింగ్, డిబేట్ వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. ఎంగిలిపూల బతుకమ్మకు ATAI కార్యవర్గసభ్యులు.. సకినాలు, సర్వపిండి, పచ్చిపులుసు, మలిలముద్దలు తదితర తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.


బతుకమ్మలను తెచ్చిన ప్రతి ఒక్కరికి ATAI ఏటా బహుమతులు ఇస్తోంది. తొలి 3 బతుకమ్మలకు బంగారు నాణాలను, ప్రతి ఒక్క బతుకమ్మకు వెండి నాణాలను ఇవ్వనున్నారు. ఇండియా నుంచి ప్రముఖ గాయని మధుప్రియ, ప్రముఖ వీణా కళాకారిణి వాణి, ప్రముఖ కళాకారుడు భిక్షు నాయక్ తదితరులు రానున్నారు. శనివారం అక్టోబర్ 1 న మధ్యాహ్నం 3 నుండి రాత్రి వరకు  Altona Westgate సెంటర్‌లో జరగనున్న ప్రధాన బతుకమ్మ సంబరాలకు మెల్బోర్న్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ATAI అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి, సభ్యులు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2022-09-26T21:22:25+05:30 IST