నేపాల్‌లోని Indian Embassy వద్ద కలకలం.. తుపాకీతో కాల్చుకుని భారత పౌరుడు మృతి

ABN , First Publish Date - 2022-07-05T19:44:40+05:30 IST

ఇండియన్ ఎంబసీ కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న భారత పౌరుడు.. ఆఫీసు ప్రాంగణంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నేపాల్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఎంబసీ అధికారులు కూడా అధికారికంగా

నేపాల్‌లోని Indian Embassy వద్ద కలకలం.. తుపాకీతో కాల్చుకుని భారత పౌరుడు మృతి

ఎన్నారై డెస్క్: ఇండియన్ ఎంబసీ కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న భారత పౌరుడు.. ఆఫీసు ప్రాంగణంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నేపాల్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఎంబసీ అధికారులు కూడా అధికారికంగా వెల్లడించారు. గత కొంత కాలంగా ఎంబసీ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 32ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం  త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల ఇంకా తెలియలేదని తెలిపిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. మృతుడి పేరు తదితర వివరాలను మాత్రం అధికారులు బయటపెట్టలేదు. 


Read more