అమెరికాలో ఎబార్షణ్ హక్కులు.. ఆర్మీ మహిళా ఉద్యోగి టిక్‌టాక్ వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-07-11T05:06:17+05:30 IST

అబార్షాన్ రాజ్యాంగపరమైన హక్కు కాదంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో అక్కడి మహిళలు అగ్గీమీత గుగ్గిలమవుతున్నారు.

అమెరికాలో ఎబార్షణ్ హక్కులు..  ఆర్మీ మహిళా ఉద్యోగి టిక్‌టాక్ వీడియో వైరల్

ఎన్నారై డెస్క్: అబార్షాన్ రాజ్యాంగపరమైన హక్కు కాదంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో అక్కడి మహిళలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సుప్రీం తీర్పుతో అవేదనకు గురైనా ఓ ఆర్మీ మహిళా ఉద్యోగి చేసిన టిక్‌టాక్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తీర్పు వెలువడిన వెంటనే ఆ మెడికల్ ఆఫీసర్ తన మనోభావాలను వెల్లడించగా ఓ టిక్‌టాక్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. దీంతో.. ప్రస్తుతం అమెరికాలో కలకలం రేగుతోంది. ‘‘నన్నో దిగువస్థాయి పౌరురాలిగా చూస్తున్న అమెరికా రాజ్యాంగాన్ని నేనెలా రక్షించాలి. దేశభక్తితో, బాధ్యతో ఎలా నా విధిని నిర్వర్తించాలి’’ అంటూ ఆమె వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఓ సైనికాధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటంటూ ఆమెపై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తోంది. 

Read more