ఆటాలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

ABN , First Publish Date - 2022-07-05T00:06:57+05:30 IST

అమెరికా (America) తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణాన్ని భక్తజనరంజకంగా..

ఆటాలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

  • ముగిసిన ఆటా వేడుకలు
  • వాషింగ్టన్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి  కిలారు ముద్దు కృష్ణ

ఎన్నారై డెస్క్: అమెరికా (America) తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణాన్ని భక్తజనరంజకంగా నిర్వహించారు. టీటీడీ (TTD) వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో అధ్యక్షుడు బూజాల భువనేష్, కన్వీనర్ సుధీర్ బండారు, కార్యవర్గ సభ్యులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, లడ్డూలను అందజేశారు. దాజీ-ఉపాసన కామినేనిల ధ్యాన సదస్సులో ప్రవాసులు పాల్గొన్నారు. త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి అవధానం ఆద్యంతం రసకందాయకంగా సాగింది. రావు తల్లా ప్రగడ, తనికెళ్ల భరణి, కూచిభొట్ల ఆనంద్, తుమ్మలపల్లి వాణీకుమారి, రెజీనా, వేముల లెనిన్, కొల్లారపు ప్రకాశరావు, రవి, మాధురి చింతపల్లి తదితరులు కీలకపాత్ర పోషించారు. 


అమెరికాలో తొలిసారిగా సమగ్ర శతావధాన కార్యక్రమాన్ని సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని కూచిభొట్ల ఆనంద్ (Kuchibotla Ananad)పేర్కొన్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వద్దిపర్తిని సత్కరించారు. బిజినెస్ ఫోరంను లక్ష్మీ చేపూరి సమన్వయపరిచారు. సయ్యంది పాదం కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రవాసులు డా.యడ్ల హేమప్రసాద్, రావు సత్తిరాజు,  పొట్లూరి రవి, నిరంజన్ శృంగవరపు, ఐకా రవి, మూల్పూరి వెంకటరావు, ఆత్మచరణ్‌రెడ్డి, మన్నవ సుబ్బారావు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ముగింపు వేడుకలలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Music Director Ilayaraja) ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను రంజింప చేసింది. అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రేమ సాగర్ రెడ్డి‌ని జీవిత సాఫల్య పురస్కారం‌తో సత్కరించారు.


Updated Date - 2022-07-05T00:06:57+05:30 IST