ఆసుపత్రిలో వివాదం.. సెక్యూరిటీ గార్డు చేతివేలు కొరికిన యువకుడు

ABN , First Publish Date - 2022-01-13T02:33:41+05:30 IST

సౌత్ ఫ్లోరిడాకు చెందిన డిల్లాన్ మెటోయర్ (19) అనే యువకుడు చికిత్స కోసం ఫోర్ట్ మైయ్యర్స్‌లో ఉన్న లీ మెమోరియల్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ నర్సు అతడికి చికిత్స చేస్తుండగా ఆమెతో

ఆసుపత్రిలో వివాదం.. సెక్యూరిటీ గార్డు చేతివేలు కొరికిన యువకుడు

ఎన్నారై డెస్క్: సౌత్ ఫ్లోరిడాకు చెందిన డిల్లాన్ మెటోయర్ (19) అనే యువకుడు చికిత్స కోసం ఫోర్ట్ మైయ్యర్స్‌లో ఉన్న లీ మెమోరియల్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ నర్సు అతడికి చికిత్స చేస్తుండగా ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న సెక్యూరిటీ సిబ్బందితో డిల్లాన్ ఘర్షణకు దిగాడు. ఇద్దరు సెక్యూరిటిగార్డులలో ఒకరిని తలపై కొట్టాడు. ఆ తర్వాత మరో సెక్యూరిటీ గార్డు చేతి వేలును కొరికేశాడు. దీంతో సదరు సెక్యూరిటీ గార్డుకు తీవ్ర రక్త స్రావం అయింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. డిల్లాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Read more