విమానంలో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడం ఆపేసిన శిశువు.. ఇంతలో..

ABN , First Publish Date - 2022-09-11T03:08:40+05:30 IST

అకస్మాత్తుగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన నెలల శిశువును ఓ నర్సు కాపాడిన ఘటన అమెరికాలో(USA) తాజాగా చోటుచేసుకుంది.

విమానంలో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడం ఆపేసిన శిశువు.. ఇంతలో..

ఎన్నారై డెస్క్: అకస్మాత్తుగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన నెలల శిశువును ఓ నర్సు(Nurse) కాపాడిన ఘటన అమెరికాలో(USA) తాజాగా చోటుచేసుకుంది. గురువారం స్పిరిట్(Spirit) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పిట్స్‌బర్గ్ నుండి ఫ్లోరిడాకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఓ శిశువు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. అకస్మాత్తుగా ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడం ఆపేయడంతో పెదవులు నీలం రంగులోకి మారిపోయాయి. దీంతో.. ఆ పాప తండ్రికి ఏం చేయాలో తెలీక కంగారు పడిపోయారు. 


వెంటనే రంగంలోకి దిగిన నర్సు టమారా.. చిన్నారి మళ్లీ ఊపిరి తీసుకునేలా చేశారు. ఈ క్రమంలో వెంటనే తేరుకున్న చిన్నారి కేరింతలు కొడుతుంటే చూసి..ఆ పాప తండ్రి సంబరపడిపోయాడు. ఇదంతా చూసిన తోటి ప్యాసింజెర్లు పెద్ద పెట్టున చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నారిని కాపాడిన నర్సును ప్రశంసల్లో మంచెత్తారు. ఈ ఘటన తాలూకు వీడియోను ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు చెందిన యాంకర్ ఒకరు షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.  



Updated Date - 2022-09-11T03:08:40+05:30 IST