7.1 అడుగుల వ్యక్తి.. నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్.. నెటిజన్ల ప్రశంసల వర్షం.. ఇంతకూ విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-06T02:32:45+05:30 IST

నెట్టింట ప్రస్తుతం ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. విమాన సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తు

7.1 అడుగుల వ్యక్తి.. నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్.. నెటిజన్ల ప్రశంసల వర్షం.. ఇంతకూ విషయం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: నెట్టింట ప్రస్తుతం ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. విమాన సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడానికి గల కారణాలు ఏంటనే వివరాల్లోకి వెళితే..


అతడి పేరు బీ బ్రౌన్. ఎత్తు 7.1ఫీట్లు. ఎత్తు కారణంగా ఎప్పుడూ అతడు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. తాజాగా జార్జియా నుంచి నార్త్ కాలిఫోర్నియాకు వెళ్లేందుకు ఫ్లైట్‌లో సీటు బుక్ చేసుకున్నాడు. తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత అతడికి ఓ విషయం అర్థమైంది. ఆ సీట్లో తాను కూర్చోలేనని గ్రహించి.. అక్కడి సిబ్బందికి విషయం చెప్పాడు. అంతేకాకుండా వేరే విమానంలో వెళ్తానంటూ దిగబోయాడు. కానీ అక్కడి సిబ్బంది.. పెద్ద మనసుతో అతడి సమస్యను అర్థం చేసుకున్నారు. దీంతో ఎకానమీ క్లాస్‌లో కాకుండా ఫస్ట్‌క్లాస్‌లో అతడికి సీటును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 40 నిమిషాలపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అతడు ఫ్లైట్‌లో ప్రయాణం చేశాడు. తాజాగా తన అనుభవానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. అతడికి చేసిన సహాయంపట్ల విమాన సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Read more