వంట సామాగ్రి కోసం వెళ్తే.. అదృష్టం వరించింది.. ఏకంగా రూ.79లక్షలు..

ABN , First Publish Date - 2022-07-17T20:03:28+05:30 IST

అతడికి ప్రస్తుతం 32ఏళ్లు. ఎప్పుడు ఆఫీస్ పని మీద బిజీగా ఉంటూ ఇంట్లో వంట సామాగ్రి ఉందా లేదా అనే విషయమే పట్టించుకోలేదు. దీంతో వంట గది మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే అతడు.. దగ్గర్లోని సూపర్ మార్కెట్‌ను సందర్శించాడు. ఈ

వంట సామాగ్రి కోసం వెళ్తే.. అదృష్టం వరించింది.. ఏకంగా రూ.79లక్షలు..

ఎన్నారై డెస్క్: అతడికి ప్రస్తుతం 32ఏళ్లు. ఎప్పుడు ఆఫీస్ పని మీద బిజీగా ఉంటూ ఇంట్లో వంట సామాగ్రి ఉందా లేదా అనే విషయమే పట్టించుకోలేదు. దీంతో వంట గది మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే అతడు.. దగ్గర్లోని సూపర్ మార్కెట్‌ను సందర్శించాడు. ఈ క్రమంలోనే అదృష్టం అతడి తలుపు తట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.79లక్షలు అతడి అకౌంట్లోకి చేరాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..అమెరికాకు చెందిన విలియమ్ జోన్స్‌.. ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. బిజీ వర్క్ కారణంగా వంట సామాగ్రి నిండుకుందనే విషయాన్ని గుర్తించలేకపోయాడు.  వంట గది మొత్తం ఖాళీ అయ్యే సరికి.. దగ్గర్లోని సూపర్ మార్కెట్‌కు పరుగులు తీశాడు. అక్కడ తన పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా అతడికి ఓ విషయం గుర్తుకు వచ్చింది. గతంలో తాను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు లక్కీ డ్రాలో 500 డాలర్లు వచ్చాయని గుర్తొచ్చి.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టే లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి, ఇంటికి తిరిగొచ్చాడు. అయితే అతడ్ని అదృష్టం వరించడంతో.. ఏకంగా 100000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.79లక్షలు) గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గెలుచుకున్న డబ్బులను ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయనున్నట్టు వెల్లడించాడు. 


Read more