ప్రవాసులూ.. జర జాగ్రత్త.. Abu Dhabi లో ఈ మిస్టేక్ చేస్తే.. రూ.21వేలు జరిమానా

ABN , First Publish Date - 2022-07-18T16:15:47+05:30 IST

మెరుగైన జీతం కోసం నిత్యం వందలాది మంది భారతీయులు విదేశీ బాటపడుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి ఎడారి దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న చట్టాలు, నిబంధనల గురించి తెలియక.. ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. బారీ మొత్తంలో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో..

ప్రవాసులూ.. జర జాగ్రత్త.. Abu Dhabi లో ఈ మిస్టేక్ చేస్తే.. రూ.21వేలు జరిమానా

ఎన్నారై డెస్క్: మెరుగైన జీతం కోసం నిత్యం వందలాది మంది భారతీయులు విదేశీ బాటపడుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి ఎడారి దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న చట్టాలు, నిబంధనల గురించి తెలియక.. ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. బారీ మొత్తంలో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో Abu Dhabiలో ఉన్న ఓ ముఖ్యమైన నిబంధన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. పెద్ద మొత్తంలో జరిమానాతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. 



రోడ్లపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు.. మన మిస్టేక్ వల్ల కానీ అవతలి వాళ్ల తప్పు వల్ల గానీ యాక్సిడెంట్‌లు జరుగుతుంటాయి. సాధారణంగా భారత్‌లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే.. ఆ ప్రదేశంలో పెద్ద మొత్తంలో జనం గుమిగూడతారు. ఇక్కడ దీన్ని పెద్దగా పట్టించుకోరు. అదే అబుధాబిలో మాత్రం ఇలా గుమిగూడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అందుకు శిక్షగా అక్కడి పోలీసులు సుమారు 1000 దిన్హార్లు (సుమారు రూ.21వేలు) జరిమానా విధిస్తారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో రద్దీ ఉండటం వల్ల.. సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అక్కడ ఈ నిబంధనను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే కాదు.. యాక్సిడెంట్ స్పాట్‌లో ఫొటోలు, వీడియోలు తీయడం కూడా అబుధాబిలో నేరమే. అందుకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు ఓకే కానీ.. ఒక వేళ కళ్ల ముందే యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. ఏం లేదు.. ఎమర్జెన్సీ నెంబర్ 999 కాల్ చేసి స్పాట్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2022-07-18T16:15:47+05:30 IST