Visa free travel for Indians: ఈ 60 దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు.. అవేంటో ఓ లుక్కేయండి..

ABN , First Publish Date - 2022-07-22T19:12:21+05:30 IST

విదేశాలకు వెళ్లాలంటే వీసా (Visa) తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే.

Visa free travel for Indians: ఈ 60 దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు.. అవేంటో ఓ లుక్కేయండి..

ఎన్నారై డెస్క్: విదేశాలకు వెళ్లాలంటే వీసా (Visa) తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీసా లేకుండా విదేశీ పర్యటనకు (Foreign Tour) వెళ్లడం కుదురుతుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. కానీ, అన్ని దేశాలకు వెళ్లడం కూదరదు. కొన్ని దేశాలు మాత్రమే వీసా ఫ్రీ ట్రావెల్‌కు (Visa free travel) అనుమతిస్తాయి. అలాంటి దేశాలకు మనం వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇక తాజాగా హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌ అనే ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ 2022 ఏడాదికి గాను విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత పాస్‌పోర్టుకు 87వ ర్యాంకు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో మన పాస్‌పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా పర్యటించే వెసులుబాటు ఉంది. ఈ దేశాల్లో భారతీయ పౌరులు మన పాస్‌పోర్టుతో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అన్నమాట. ఈ జాబితాలోని 60 దేశాలపై ఓ లుక్కేద్దాం.. 


జాబితాలోని 60 దేశాలు..

కుక్ దీవులు, ఫిజీ, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నియు, పలావు దీవులు, సమోవా, తువాలు, వనాటు, ఇరాన్, జోర్డాన్, ఖతార్, ఒమన్, అల్బేనియా, సెర్బియా, బార్బడోస్, బ్రిటీష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావో (SAR China), మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, తైమూర్-లెస్టే, బొలీవియా, మారిషస్, టాంజానియా, టోగో, సెనెగల్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగో, సెర్రా లియోన్, ట్యునీషియా, ఎల్ సాల్వడార్, బోట్స్‌వానా, కేప్ వెర్డే దీవులు, కొమోరెస్ దీవులు, ఇథియోపియా, గాబన్, మడగాస్కర్, మౌరిటానియా, మొజాంబిక్, రువాండా, సీషెల్స్, సోమాలియా, ఉగాండా, జింబాబ్వే.


Updated Date - 2022-07-22T19:12:21+05:30 IST