రష్యా-ఉక్రెయిన్ యుధ్దం.. హంగేరీ మీదుగా స్వదేశానికి చేరుకుంటున్న భారత పౌరులు.. ఇప్పటి వరకూ ఎంత మంది వచ్చారంటే..

ABN , First Publish Date - 2022-03-05T00:41:39+05:30 IST

యుద్ధం కారణంగా భారత పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్ వీడుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే పొరుగు దేశాలకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి ‘ఆపరేషన్ గంగా’లో భాగంగా భారత ప్రభు

రష్యా-ఉక్రెయిన్ యుధ్దం.. హంగేరీ మీదుగా స్వదేశానికి చేరుకుంటున్న భారత పౌరులు.. ఇప్పటి వరకూ ఎంత మంది వచ్చారంటే..

ఎన్నారై డెస్క్: యుద్ధం కారణంగా భారత పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్ వీడుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే పొరుగు దేశాలకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి ‘ఆపరేషన్ గంగా’లో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటికి హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి సుమారు 3వేల మంది భాతీయులను ఇండియాకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మరో 1100 మంది భారత పౌరులు శుక్రవారం రోజు ఇండియాకు బయల్దేరనున్నట్టు పేర్కొన్నారు. 1400 మందిని భారత్‌కు తరలించేందుకు మరో ఏడు విమానాలను సిద్ధం చేయాలని పౌర విమానయాన శాఖను కోరినట్టు చెప్పారు. కాగా.. హర్దీప్ సింగ్ పూరి హంగేరీ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. 
Read more