ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో పడుకున్న టీనేజీ అమ్మాయి.. అందరూ నిద్రపోయాక అనూహ్య ఘటన.. విషయం తెలిసి ఉలిక్కిపడ్డ స్నేహితులు

ABN , First Publish Date - 2022-07-21T01:16:54+05:30 IST

టీనేజీ పిల్లలు ఎక్కువగా తమ స్నేహితులతోనే కాలం గడుపుతారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీనేజీ అమ్మాయి కూడా స్నేహితులతో కలసి రాత్రి భోజనం చేసింది. తర్వాత స్నేహితులతో కలసి ఓ రూమ్‌లో పడుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్య ఘటన చో

ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో పడుకున్న టీనేజీ అమ్మాయి.. అందరూ నిద్రపోయాక అనూహ్య ఘటన.. విషయం తెలిసి ఉలిక్కిపడ్డ స్నేహితులు

ఎన్నారై డెస్క్: టీనేజీ పిల్లలు ఎక్కువగా తమ స్నేహితులతోనే కాలం గడుపుతారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీనేజీ అమ్మాయి కూడా స్నేహితులతో కలసి రాత్రి భోజనం చేసింది. తర్వాత స్నేహితులతో కలసి ఓ రూమ్‌లో పడుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విషయం తెలిసి మిగతా స్నేహితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



జర్మనీకి చెందిన 18ఏళ్ల అమ్మాయి.. ఈ నెల 18న న్యూబ్రాండెన్‌బర్గ్‌లోని అపార్ట్‌మెంట్ గదిలో తన స్నేహితులతో కలిసి రాత్రి భోజనం చేసింది. అనంతరం వారితో కలిసి అదే గదిలో పడుకుంది. ఆమెకు నిద్రలో నడిచే అలవాటు ఉండటంతో.. అర్ధరాత్రి వేళ నిద్రలో నడవటం మొదలు పెట్టింది. ఈ క్రమంలో గది కిటీకి తలుపులు తెరిచి ఉండటంతో.. 5వ అంతస్థు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు ఆమెను చూసి ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా.. సదరు టీనేజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. నిద్రలో నడిచే అలవాటు చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. సుమారు 30శాతం పిల్లలకు ఈ అలవాటు ఉంటుందట. పెద్దల్లో కేవలం 4 శాతం మంది మాత్రమే స్లీప్ వాక్ చేస్తారట.


Updated Date - 2022-07-21T01:16:54+05:30 IST