సైంధవ లవణంతో..

ABN , First Publish Date - 2022-09-27T06:48:06+05:30 IST

టబ్‌ నిండా గోరు వెచ్చని నీళ్లు నింపి, దాన్లో రెండు కప్పుల సైంధవ లవణం కలిపి పూర్తిగా కరగనివ్వాలి.

సైంధవ లవణంతో..

సైంధవ లవణం నిజానికి ఉప్పు కాదు. అది మెగ్నీషియం, సల్ఫేట్‌లతో తయారైన ఒక ఖనిజ లవణం. ఆ లవణానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటంటే....

టబ్‌ నిండా గోరు వెచ్చని నీళ్లు నింపి, దాన్లో రెండు కప్పుల సైంధవ లవణం కలిపి పూర్తిగా కరగనివ్వాలి. తర్వాత ఆ నీటిలో 10 నుంచి 15 నిమిషాలు మునిగి ఉంటే ఒళ్లు, కండరాల నొప్పులు తగ్గుతాయి.

చర్మం మీద పేరుకునే మృతకణాలను వదిలించాలంటే స్నానం చేసేటప్పుడు గుప్పెడు సైంధవ లవణాన్ని చేతుల్లోకి తీసుకుని ఒళ్లంతా రుద్దుకోవాలి.

ముఖం మీద తలెత్తే బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ వదలాలంటే ఒక టీస్పూను ఎప్సమ్‌ సాల్ట్‌ చేతుల్లోకి తీసుకుని, కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి ముఖాన్ని సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మృత కణాలు వదలడంతోపాటు బ్లాక్‌ అండ్‌  వైట్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.

ఆర్గానిక్‌ కొబ్బరినూనెకు సైంధవ లవణాన్ని కలిపి దీంతో పెదవులు రుద్దుకుంటే పగిలిన పెదవులు కోమలంగా మారతాయి.

ఒక గ్లాసు నీళ్లలో రెండు టీస్పూన్ల సైంధవ లవణాన్ని కలిపి తాగితే మలబద్ధకం తొలగిపోతుంది.

Read more