నాగేశ్వరరావు ఎప్పుడొస్తాడో..?

ABN , First Publish Date - 2022-09-11T09:23:45+05:30 IST

‘నాగేశ్వరరావు...’ ఈ పేరుతో ఓ టైటిల్‌ రిజిస్టర్‌ అయ్యింది.

నాగేశ్వరరావు ఎప్పుడొస్తాడో..?

నాగేశ్వరరావు...’ ఈ పేరుతో ఓ టైటిల్‌ రిజిస్టర్‌ అయ్యింది. నాగచైతన్య కోసం. పరశురామ్‌ దర్శకుడిగా నాగచైతన్య కథానాయకుడిగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసమే ఆ టైటిల్‌. ‘సర్కారు వారి పాట’ తరవాత పరశురామ్‌ చేయాల్సిన సినిమా ఇదే. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమా గురించిన అప్‌ డేట్‌ బయటకు రాలేదు. మరోవైపు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా ఒప్పుకొన్నాడు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. దాంతో... చైతూ - పరశురామ్‌ సినిమా లేదు.. అనే వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పరశురామ్‌ చెప్పిన కథలో చైతూ చాలా మార్పులు చెప్పాడట. ఆ మార్పుల వల్ల కథ మొత్తం కిచిడీలా తయారైందని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దాంతో.. ఈ కథ పక్కన పెట్టేసి, చైతూ కోసం వేరే కథ సిద్ధం చేయడానికి పరశురామ్‌ రెడీ అయ్యాడని టాక్‌. అయితే చైతూ దొరకాలంటే కనీసం ఆరేడు నెలలు ఆగాలి. అప్పటి వరకూ పరశురామ్‌ ఎదురు చూస్తాడా, లేదంటే మరో హీరోతో ప్రొడీస్‌ అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టు హోల్డ్‌లో ఉన్నట్టే అని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Read more