వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల్లో

ABN , First Publish Date - 2022-09-10T05:40:33+05:30 IST

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియెగదారులు ఒకరికి ఒకరు ఉచితంగా ఉచితంగా కాల్‌ చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల్లో

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియెగదారులు ఒకరికి ఒకరు ఉచితంగా ఉచితంగా కాల్‌ చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి మంగళం పాడే దిశగా యత్నాలు ఆరంభమయ్యాయని సమాచారం. ఈ ఇంటర్నెట్‌ యాప్స్‌ అందిస్తున్న ‘ఉచితంగా కాల్‌’ సదుపాయాన్ని సమీక్షించాలని ట్రాయ్‌ని అడిగినట్టు భోగట్టా. ‘సేమ్‌ సర్వీస్‌, సేమ్‌ రూల్స్‌’ అంటూ టెలికామ్‌ ఆపరేటర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి 2008లోనే ట్రాయ్‌ ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రస్తుతం మళ్ళీ సమీక్షించాలని ప్రభుత్వమే యత్నిస్తుండటం గమనార్హం. ఇంటర్నెట్‌ టెలిఫోన్‌ ఆపరేటర్లు, ఓటీటీ ప్లేయర్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలు రూపొందించాలని భావిస్తోంది. 


2008లో ట్రాయ్‌ సిఫార్సుల ప్రకారం, ఇంటర్నెట్‌ కాల్స్‌ కోసం సాధారణ టెలిఫోన్‌ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించుకునేందుకు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు వీలు కల్పించాలి. అందుకుగాను ఇంటర్‌ కనెక్షన్‌ చార్జీలను చెల్లించాలి. చట్టం ఆమోదించే ఇంటర్‌సెప్షన్‌ ఎక్విప్‌మెంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. పలు సెక్యూరిటీ ఏజెన్సీలు విధించే నిబంధనలను కూడా పూర్తి చేయాలి. అప్పటికి సద్దుమణిగినప్పటికీ 2016-17లో మళ్ళీ ఇదే అంశం యవనికపైకి వచ్చింది. నెట్‌ న్యూట్రాలిటీ కూడా చర్చల్లో వచ్చింది.   మొత్తమ్మీద సదరు యాప్స్‌ సైతం ఎంతో కొంత మొత్తం కాల్స్‌ వ్యవహారంలో చెల్లించాలన్నది సారాంశం.

Updated Date - 2022-09-10T05:40:33+05:30 IST