Wedding Planner : ఇప్పుడు పెళ్ళి చేయాలంటే వీళ్ళు ఉండాల్సిందే..

ABN , First Publish Date - 2022-11-30T15:28:59+05:30 IST

బాధ్యతను అప్పగించాకా ఈవెంట్ ను తెలివిగా సులువుగా ప్లాన్ చేస్తారు.

Wedding Planner : ఇప్పుడు పెళ్ళి చేయాలంటే వీళ్ళు ఉండాల్సిందే..
wedding planner

ఒకప్పుడు పెళ్ళి జరగాలంటే అది చాలా పెద్ద తతంగంలా ఉండేది. సంబంధాలు వెతకడం దగ్గర నుంచి పెళ్ళి చూపులు, తాంబూలాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అందరికీ నచ్చితే పెళ్ళి అంటే కనీసం ఆరు మాసాల ముందు నుంచే ఈ హఢావుడి ఇళ్ళల్లో ఉండేది. ఏ చీర కట్టుకోవాలి. ఎవరెవరిని పిలవాలి వరకూ. మగ పెళ్ళివారికి ఎంత ఆస్తి ఉంది వాళ్ళు మనతో తూగగలరా లాంటి మామూలు ప్రశ్నల నుంచి అబ్బాయి, అమ్మాయి ఒకరి ఇష్టం ఒకరు తెలుసుకునేంత వరకూ అంత బాధ్యతనూ మ్యారేజ్ బ్యూరోలు వాళ్ళ తలమీద వేసుకుని పెళ్ళి తంతుని దగ్గరుండి జరిపించేస్తున్నాయి. అసలు మ్యారేజ్ బ్యూరోలకన్నా ముందు మనకు తెలిసింది పెళ్ళిళ్ళ పేరయ్యలే.. వాళ్లే ఇల్లిల్లు తిరిగి పెళ్ళీడుకొచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధాలు పట్టుకొచ్చేవారు. అయితే ఇదంతా పోయి ఆడా మగా తేడా లేకుండా అందరూ ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు నడిపేస్తున్నారు. ప్రతి కులానికి ఇప్పుడు మ్యాట్రిమోనీలు ఉన్నాయి.

AWedding-Planner.jpg

ఇక పెళ్ళి ఖాయం అవగానే వెడ్డింగ్ ఫ్లానర్స్ కు పెళ్ళి బాధ్యతంతా అప్పగించేసి హాయిగా షాపింగ్స్ చేసుకుని పెళ్ళికి సిద్ధమవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటున్నారు ఇప్పటి జనం. ఇవి వధూవరులిద్దరూ ఇష్టపడ్డాకా దగ్గరుండి వివాహ వేడుక జరిపించడానికి కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో బిజీగా కాలం గడుపుతున్నవారే. లేదా విదేశాలలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నవారే ఎక్కువ. వాళ్ళకు నచ్చిన విధంగా సంబంధాలను ఎంచుకుని ప్రాధాన్యతల మేరకు వివాహాలకు జరిపించుకుంటున్నారు. ఇక ఈ పెళ్లి బాధ్యతను దగ్గరుండి నిర్వహించే పనిని ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ తీసుకుంటున్నాయి.

ఈవెంట్ మేనేజ్ మెంట్, వెడ్డింగ్ ఫ్లానర్స్ పేర్లు ఏవైనా చేసే పనుల్లో పెద్దగా తేడా ఏం లేదు. ఇవి పండుగలు, సమావేశాలు, వేడుకలు, వివాహాలు, అధికారిక పార్టీలు, కచేరీలు, సమావేశాలు వంటి చిన్న, పెద్ద-స్థాయి వ్యక్తిగత, కార్పొరేట్ ఈవెంట్‌లను దగ్గరుండి జరిపిస్తాయి. పూర్వం ఏ కార్యక్రమాలైనా స్నేహితులు, బంధువుల సాయంతో జరిగేవి మరిప్పుడో అంతా బిజీ బిజీ గడిపోతున్న సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఇలా ఈవెంట్ మేనేజ్ మెంట్ కు బాధ్యతను అప్పగిస్తే వాళ్ళే కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతను నెత్తిన వేసుకుని పూర్తి చేస్తారు.

వీరికి బాధ్యతను అప్పగించాకా ఈవెంట్ ను తెలివిగా సులువుగా ప్లాన్ చేస్తారు. వచ్చే చుట్టాలు, బంధువులు, స్నేహితులతో కాలం సంతోషంగా గడిచే విధంగా ఏర్పాట్లు చేస్తారు. వేదికను అలంకరించడం దగ్గర నుంచి కమ్మనైన భోజనాలను వడ్డించి విందును కూడా వాళ్లే ఏర్పాటు చేస్తారు. ఈవెంట్ మొత్తం ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా జరిగేలా ప్లాన్ చేసుకుంటారు. వివాహానికి ఎంత సమయం ఉంది. ఎంత ఖర్చు పెట్టగలరు, ఎలాంటి భోజనాలు కావాలి, ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఎలా ఉండాలనే దానిమీద వెడ్డింగ్ ప్లానర్స్ ప్రణాళికలు వేసుకుంటారు. వధూవరులు కోరుకున్న థీమ్‌కు సంబంధించిన అలంకరణలు, పూల ఏర్పాట్లు, క్యాటరింగ్‌తో పాటు ఆటపాటల కార్యక్రమాలను కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తారు. వచ్చిన అతిథులకు సౌకర్యాలన్నీఅందేలా చూసుకుంటారు.

Wedding-planner.jpg

ఈవెంట్స్ మేనేజ్‌మెంట్‌లో

సాధారణంగా, వెడ్డింగ్ ప్లానర్ ఆహారం, పువ్వులు, అలంకరణలు, ఫోటోగ్రాఫర్‌లు, సంగీతకారులు వంటివి ఏర్పాటు చేయడానికి సఫ్లయర్స్ తో కమ్యూనికేట్ చేస్తారు. దీనికి వెడ్డింగ్ ప్లానర్‌లు ప్రొఫెషనల్ కాంటాక్ట్‌ల జాబితాను సిద్ధంగా ఉంచుకుంటారు.

ఈవెంట్ షెడ్యూల్‌ అవసరం.

వెడ్డింగ్ ప్లానర్ ఈవెంట్ చేయబోయే వేడుకకు సంబంధించి సరైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఈ ప్లాన్‌ను చేసేటప్పుడు, వెడ్డింగ్ ప్లానర్‌లు సాధారణంగా క్లయింట్‌లతో షెడ్యూలింగ్ చర్చించి ప్లాన్ చేస్తారు. పెళ్ళిలో జరిగే ఏ రెండు ఈవెంట్‌లు ఒకదానితో ఒకటి పోటీ పడకుండా చూసుకుంటారు. ఈ ఈవెంట్ షెడ్యూల్ వెడ్డింగ్ ప్లానర్‌లను డెలివరీలను షెడ్యూల్ చేయడానికి, ఈ పనికి ఇంటెన్సివ్ టాస్క్, టైమ్ మేనేజ్‌మెంట్ అవసరం. ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా వ్యవహరించే స్కిల్స్ కూడా ఒక్కోసారి అవసరమే.

వెడ్డింగ్ ప్లానర్ నైపుణ్యాలు

వేడుకలు, రిసెప్షన్‌లను విజయవంతంగా ప్లాన్ చేయడానికి వెడ్డింగ్ ప్లానర్స్ వేడుక సమయంలో థీమ్‌లు, బడ్జెట్‌, నాణ్యతలోని చిన్న వివరాలపై శ్రద్ధ చూపేలా ఖచ్చితమైన శ్రద్ధ అవసరం. స్టేజ్ డెకరేటర్ నుండి ఫ్లోరిస్ట్ నుండి బ్యూటీషియన్ వరకు ఖచ్చితమైన సమన్వయం చేసుకోవాలి. వెడ్డింగ్ ఈవెంట్ ప్లానర్ కేవలం ఈవెంట్‌ను చూసుకోవడం కంటే చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. పెళ్లి అయిపోయింది. అతిథులు వెళ్లిపోయారు. స్టేజ్ డెకరేటర్‌లు, క్యాటరర్‌లకు చెల్లింపులను ఎదుర్కోవాల్సిఉంటుంది. ఏ చిన్న తేడా జరగకుండా పని పూర్తి చేసుకుని ప్రసంశలను అందుకుంటారు.

Updated Date - 2022-11-30T15:31:18+05:30 IST