France : దేశం ఫ్రాన్స్‌

ABN , First Publish Date - 2022-12-08T23:47:31+05:30 IST

ఫ్రాన్స్‌ జనాభా 68 మిలియన్లు. రాజధాని పేరు ప్యారిస్‌. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం కంటే ఫ్రాన్స్‌ చిన్నది. 29 దేశాల్లో ఫ్రెంచ్‌ అధికార భాష. ఈ దేశం ఎనిమిది దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది.

France : దేశం ఫ్రాన్స్‌

  • ఫ్రాన్స్‌ జనాభా 68 మిలియన్లు. రాజధాని పేరు ప్యారిస్‌. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం కంటే ఫ్రాన్స్‌ చిన్నది. 29 దేశాల్లో ఫ్రెంచ్‌ అధికార భాష. ఈ దేశం ఎనిమిది దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది.

  • పర్యాటకులు ఎక్కువమంది చూడాలనుకునే దేశం ఫ్రాన్స్‌. ప్రతి ఏడాది 89 మిలియన్ల మంది ఫ్రాన్స్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచీ వెళ్తున్నారు. అది కూడా అత్యధికంగా పారి్‌సలోని ఐఫిల్‌ టవర్‌తో పాటు అక్కడి ఫ్యాషన్‌, కల్చర్‌, ఆర్ట్‌వర్క్స్‌, ఫుడ్‌ను ఎంజాయ్‌ చేయటానికే!

  • పారి్‌సలోని లావర్‌ మ్యూజియంకు వెళ్లి అక్కడ ప్రతి ఆర్ట్‌ను చూడటానికి 30 సెకన్ల సమయం కేటాయిస్తే అన్ని ఆర్ట్‌వర్క్స్‌ అలా చూడటానికి వంద రోజులు పడుతుంది.

  • 1500 రకాల చీజ్‌లు దొరుకుతాయిక్కడ. ముఖ్యంగా వీళ్లు నత్తలను ఇష్టపడతారు. ఎంతా అంటే.. సంవత్సరానికి 30 వేల మెట్రిక్‌ టన్నుల నత్తలను తింటారు. వీటిని వెన్న,గార్లిక్‌ వేసి వండుతారు. రెస్టారెంట్స్‌లో షెల్‌ తీయటానికి ప్రత్యేక వస్తువులు కూడా ఉంటాయి. హై స్పీడ్‌ ట్రైన్‌లో బతికి ఉన్న నత్తలను తీసుకొస్తే వాటికీ టికెట్‌ తీసుకోవాల్సిందే.

  • ఇక్కడ సూపర్‌ మార్కెట్స్‌లో ఫుడ్‌ డేట్‌ అయిపోయిందని బయట పడేయకూడదని ఓ చట్టం 2016లో చేసింది. ఆహారంపై డేట్‌ చూసుకుని అనుగుణంగా ఫుడ్‌ బ్యాంకులకు డొనేట్‌ చేస్తారు.

  • మనం పెళ్లిలో తెల్లదుస్తులు ధరించే సంస్కృతి 1499 వ సంవత్సరంలో ఫ్రెంచి రాజుల నుంచి వచ్చింది.

  • ఆఫీసులో పనిగంటలు దాటాక లేదా వారాంతాల్లో ఉద్యోగులకు మెయిల్స్‌ చేయటం అక్కడ పెద్ద తప్పు.

  • మొదటి కృత్రిమ గుండె ట్రాన్స్‌ప్లాంట్‌ చేసింది ఫ్రాన్స్‌లోని. తొలిసారి కెమెరా ఫోన్‌ చేసింది ఈ దేశమే. ఫిలిప్పే కాన్‌ అనే వ్యక్తి ఫోన్‌కు కెమెరా సెట్‌ చేసి తన కూతురు ఫొటోను తీశాడు. అదే ఫస్ట్‌ ఫోన్‌ ఫొటో!

  • 1738 సంవత్సరంలో మాంట్‌గోల్‌ఫైర్‌ బ్రదర్స్‌ ‘హీలియం బెలూన్‌’ కనుగొన్నారు.

Updated Date - 2022-12-08T23:47:33+05:30 IST