సమంతకు సర్జరీ... నిజమెంత..?

ABN , First Publish Date - 2022-09-25T07:00:04+05:30 IST

టాలీవుడ్‌లోని అగ్ర కథానాయికల్లో సమంత పేరు తప్పకుండా ఉంటుంది. ఆమెపై ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌ లో హల్‌ చల్‌ చేస్తోంది.

సమంతకు సర్జరీ... నిజమెంత..?

టాలీవుడ్‌లోని అగ్ర కథానాయికల్లో సమంత పేరు తప్పకుండా ఉంటుంది. ఆమెపై ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌ లో హల్‌ చల్‌ చేస్తోంది. సమంత చర్మ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారని, ఆమెకు త్వరలోనే అమెరికాలో ఆపరేషన్‌ జరగబోతోందని ఓ వార్త షికారు చేస్తోంది. దానికీ బలమైన కారణాలున్నాయి. సమంత కథానాయికగా ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు రెండో వారంలో ‘ఖుషి’ కోసం సమంత కాల్షీట్లు కేటాయించింది. అయితే.. ఈ షూటింగుకు అనారోగ్య సమస్యలతో డుమ్మా కొట్టింది. అంతేకాదు.. ‘శాకుంతలమ్‌’, ‘యశోద’ డబ్బింగులు కూడా వాయిదా పడ్డాయి. సమంత రాక కోసం ఆయా చిత్ర బృందాలు ఎదురు చూస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సమంత.. ఈమధ్య అసలు కనిపించడమే మానేసింది. దాంతో.. సమంతపై వచ్చిన ఈ వార్త నిజమే అని అభిమానులూ భావిస్తున్నారు. సమంత సన్నిహితులు సైతం ఈ విషయంపై స్పందించడం లేదు. సమంత మేనేజర్‌ మాత్రం ‘ఆమె ఆరోగ్యంతోనే ఉన్నారు’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమంత అమెరికా ప్రయాణంపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. ఈ విషయంపై సమంత త్వరగా స్పందిస్తే తప్ప ఈ వార్తలకు పుల్‌ స్టాప్‌ పడేలా లేదు. 

Read more