సూపర్‌ స్లింగ్‌ బ్యాగ్స్‌!

ABN , First Publish Date - 2022-09-21T06:10:20+05:30 IST

లిప్‌స్టిక్‌ మొదలుకుని, ల్యాప్‌టాప్‌ వరకూ అవసరమైన అన్ని వస్తువులను వెంట తీసుకెళ్లగలిగే ‘స్లింగ్‌ బ్యాగ్స్‌’ ఇప్పటి ఫ్యాషన్‌ ట్రెండ్‌.

సూపర్‌ స్లింగ్‌ బ్యాగ్స్‌!

లిప్‌స్టిక్‌ మొదలుకుని, ల్యాప్‌టాప్‌ వరకూ అవసరమైన అన్ని వస్తువులను వెంట తీసుకెళ్లగలిగే ‘స్లింగ్‌ బ్యాగ్స్‌’ ఇప్పటి ఫ్యాషన్‌ ట్రెండ్‌. కాలేజీ, షాపింగ్‌, ఆఫీసు... ఇలా సందర్భానికి తగిన స్లింగ్‌ బ్యాగ్స్‌లో అనువైనవి ఎంచుకుంటే ఫ్యాషన్‌ ఐకాన్‌ మీరే కావొచ్చు.


బకెట్‌ స్లింగ్‌ బ్యాగ్‌: ఉద్యోగినులకు, పిల్లాపాపలతో షాపింగ్‌కి బయల్దేరే గృహిణులకూ ఉపయోగపడే బ్యాగ్‌ ఇది. ఎక్కువ వస్తువులు పట్టే వీలుండటంతోపాటు స్టయిలి్‌షగా కూడా కనిపించే ఈ బ్యాగ్‌ ఉపయోగించటం కూడా తేలికే! అవసరమైన వస్తువును చటుక్కున అందుకోగలిగేలా ఈ బ్యాగ్‌ డిజైన్‌ అయి ఉంటుంది.

కాన్వాస్‌ స్లింగ్‌ బ్యాగ్‌: టీనేజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన బ్యాగ్‌ ఇది. జీన్స్‌, ఫ్రాక్‌, షార్ట్స్‌...ఇలా ఏదైనా ఇట్టే మ్యాచ్‌ అయిపోతుంది. పొడవాటి స్లింగ్‌ చివరన ముచ్చటగా వేలాడే ఈ బ్యాగ్‌ బరువు కూడా తక్కువే! లిప్‌స్టిక్‌, దువ్వెన, ఏటిఎమ్‌ కార్డ్స్‌, డబ్బులు...అలా టీనేజర్లకు అత్యవసరమైన వస్తువుల కోసం డిజైన్‌ ఈ చేసిన ఈ బ్యాగ్‌ ఇది.

క్రొషెట్‌ స్లింగ్‌ బ్యాగ్‌: ఊలు, జూట్‌, కొబ్బరి పీచు, అరటి నార... ఇలా ప్రకృతి సిద్ధమైన వస్తువులతో తయారుచేసిన హ్యాండ్‌ బ్యాగ్స్‌ ఇవి. పర్యావరణ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా తయారయ్యే ఈ బ్యాగ్‌లు ఆకర్షణీయంగా కనిపించంతోపాటు హ్యాండిల్‌ చేయటానికి తేలికగా కూడా ఉంటాయి. 

క్రాస్‌ బాడీ స్లింగ్‌ బ్యాగ్‌: బ్యాగ్‌ను భుజానికి తగిలించుకోవటం, చేతికి వేలాడదీసుకోవటం మీకు చిరాకా? అయితే ఈ క్రాస్‌ బాడీ స్లింగ్‌ బ్యాగ్‌ను ఎంచుకోండి. భుజం మీద నుంచి నడుము దగ్గరికి వేలాడేసుకునే వీలుండే ఈ క్రాస్‌ బాడీ స్లింగ్‌ బ్యాగ్‌ మొత్తం లుక్‌నే మార్చేస్తుంది. ఎలాంటి మోడర్న్‌ డ్రస్‌కైనా భలేగా మ్యాచ్‌ అయిపోతుంది.

ఫంకీ స్లింగ్‌ బ్యాగ్‌: టీనేజ్‌లోకి అడుగుపెట్టే పిల్లల కోసమే ఈ ఫంకీ స్లింగ్‌ బ్యాగ్‌. పిల్లులు, కుక్కలు మొదలైన జంతువుల బొమ్మలు ప్రింట్‌ అయి ఉండే ఈ ఫంకీ బ్యాగ్‌లు చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటాయి. తేలికగా, సౌకర్యంగా ఉండటంతోపాటు స్టయిలి్‌షగా కూడా కనిపిస్తాయి. సో...పిల్లలూ! గ్యాంగ్‌ మొత్తంలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అవ్వాలనుకుంటే ఈ ఫంకీ బ్యాగ్‌లను ట్రై చేయండి.

Read more