వేసవిలో కూల్‌ లుక్‌!

ABN , First Publish Date - 2022-03-16T05:30:00+05:30 IST

వేసవికాలం కాస్త ఉపశమనంగా ఉండాలంటే కాటన్‌ దుస్తులు ధరించక తప్పదు. అయితే ఇందులోనూ కాస్త ట్రెండీ లుక్‌ ఉండే దుస్తులను ఎంపిక...

వేసవిలో కూల్‌ లుక్‌!

వేసవికాలం కాస్త ఉపశమనంగా ఉండాలంటే కాటన్‌ దుస్తులు ధరించక తప్పదు. అయితే ఇందులోనూ కాస్త ట్రెండీ లుక్‌ ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవడంపై  దృష్టి పెడితే చాలు. అలాంటి కొన్ని డ్రెస్‌లు ఇవి...


అనార్కలీ కుర్తా

వేసవి సీజన్‌లో ఈవినింగ్‌ పార్టీలకు హాజరయ్యే సమయంలో ఈ డ్రెస్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లోరల్‌ ప్రింటింగ్‌తో డ్రెస్‌ బాగా హైలెట్‌ అవుతుంది. పార్టీలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వేసవి ఉక్కపోత సమస్య ఉండదు. ట్రెండీగానూ ఉంటుంది. లెగ్గింగ్స్‌తో పాటు వేసుకోవచ్చు.


అంగ్‌రకా డ్రెస్‌

ఇండో-వెస్ట్రన్‌ ఫ్యాషన్‌ను అభిమానించే వారికి ఇది బాగా నప్పుతుంది. బందానీ ప్రింట్‌తో డీసెంట్‌ లుక్‌నిస్తుంది. ప్యాంట్‌తో పాటు ధరించినా బాగుంటుంది.


కాటన్‌ ఎ-లైన్‌ డ్రెస్‌

సింపుల్‌ డిజైన్‌తో, మంచి రంగులో చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంటుంది. వేసవి కాలంలో ఈ డ్రెస్‌ బాగా నప్పుతుంది. వి-నెక్‌, ఫ్రీ ఫ్లో సిల్హౌటీ ఉన్న ఈ ఎంబ్రాయిడరీ డ్రెస్‌ ఎలాంటి శరీర ఆకృతి ఉన్న వారికైనా నప్పుతుంది. 


పింక్‌ బాయ్‌ఫ్రెండ్‌ షర్ట్‌

సమ్మర్‌ సీజన్‌లో ఆఫీసుకు వెళ్లే వారికి నప్పే డ్రెస్‌ ఇది. వీకెండ్‌ పార్టీల్లోనూ వేసుకోవచ్చు. లాంగ్‌ స్లీవ్స్‌, బటన్‌ కఫ్స్‌తో లేత గులాబీ రంగులో డ్రెస్‌ కూల్‌ లుక్‌నిస్తుంది. 

Read more