ఇయర్‌ రింగ్స్‌ ఎంపిక ఇలా..

ABN , First Publish Date - 2022-08-25T06:29:40+05:30 IST

స్టడ్స్‌, హ్యాంగింగ్స్‌, ఇయర్‌ జాకెట్స్‌... ఇయర్‌ వేర్‌లో బోలెడన్ని రకాలు.

ఇయర్‌ రింగ్స్‌ ఎంపిక ఇలా..

స్టడ్స్‌, హ్యాంగింగ్స్‌, ఇయర్‌ జాకెట్స్‌... ఇయర్‌  వేర్‌లో బోలెడన్ని రకాలు. వీటిలో కంటికి నచ్చినది కొని ధరించడం కంటే ముఖాకృతికి మ్యాచ్‌ అయ్యేవి ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తాం! ముఖాకృతికి నప్పే ఇయర్‌ రింగ్స్‌ ఇవే!


గుండ్రటి ముఖం: పొడవాటి లేదా కోలగా ఉండే ఇయర్‌ హ్యాంగింగ్స్‌ ఈ ముఖాకృతికి సూటవుతాయి. ఇందుకోసం టియర్‌డ్రాప్‌, డ్యాంగ్లర్లు ఎంచుకుని, గుండ్రంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. 

కోల ముఖం: ఈ ముఖాకృతికి ఎలాంటి ఇయర్‌ రింగ్స్‌ అయినా సూటవుతాయి. కాబట్టి టియర్‌డ్రాప్‌ లేదా స్టడ్స్‌ ఎంచుకోవచ్చు.

హృదయాకార ముఖం: డ్యాంగిల్స్‌, టియర్‌డ్రాప్స్‌, షాండ్లియర్‌ ఇయర్‌ రింగ్స్‌ నప్పుతాయి. 

నలుచదరపు ముఖం: ఈ ముఖాకృతి సమంగా కనిపించడం కోసం గుండ్రటి ఇయర్‌ రింగ్స్‌ ఎంచుకోవాలి. ఇయర్‌ హ్యాంగింగ్స్‌, డ్యాంగ్లింగ్స్‌, ఇయర్‌ హూప్స్‌ బాగుంటాయి. 

వజ్రాకృతి ముఖం: డ్యాంగిల్‌, హూప్‌ ఇయర్‌ రింగ్స్‌ ఎంచుకోవాలి. డైమండ్‌ షేప్‌లో ఉండే ఇయర్‌ రింగ్స్‌ ధరించకూడదు.

Read more