Seasonal Allergies : అలర్జీ అంటే అంత అలుసా? అదెంత ప్రమాదకరమో మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-11-28T22:58:42+05:30 IST

శరీర రోగనిరోధక వ్యవస్థ అలర్జిన్‌కు ప్రతిస్పందించినప్పుడు తలెత్తే ఒక సాధారణ పరిస్థితి. అలర్జీ తీవ్రత కొందర్లో తక్కువగా ఉంటే, మరి కొందర్లో ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

Seasonal Allergies : అలర్జీ అంటే అంత అలుసా? అదెంత ప్రమాదకరమో మీకు తెలుసా?

శరీర రోగనిరోధక వ్యవస్థ అలర్జిన్‌కు ప్రతిస్పందించినప్పుడు తలెత్తే ఒక సాధారణ పరిస్థితి. అలర్జీ తీవ్రత కొందర్లో తక్కువగా ఉంటే, మరి కొందర్లో ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, పెంచుకునే జంతువులు, వాడే సువాసనలు, వేసుకునే మందులు కూడా అలర్జీలకు కారణమే! ఈ సమస్య ప్రమాదకరమైనది కాకపోయినా, అలసత్వం వహిస్తే, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అలర్జీల విజృంభణకు చలికాలం అనువైన సమయం. కాబట్టి మనం సాధారణంగా ఎదుర్కొనే కొన్ని రకాల అలర్జీలు, వాటి కారకాలు, నివారణలపై అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.

వివిధ అలర్జీలు - కారకాలు

ముక్కు అలర్జీ

కారకం: ధూళిలోని క్రిములు

లక్షణాలు: తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బెడ

చర్మ అలర్జీ

కారకాలు: గుడ్లు, పాలు, పీతలు, రొయ్యలు, సోయా, నట్స్‌, గోధుమలు

లక్షణాలు: దురద, చర్మంపై దద్దుర్లు, గురక, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, పల్స్‌ పడిపోవడం, శరీరం నీలి రంగులోకి మారడం

కంటి అలర్జీ

కారకాలు: పుప్పొడి, ధూళి క్రిములు, పెంపుడు జంతువులు

లక్షణాలు: కళ్లలో దురద, వాపు, నీరు కారడం, ఎరుపెక్కడం

ఊపిరితిత్తుల అలర్జీ (బ్రాంఖైటిస్‌/ఆస్తమా)

కారకాలు: డస్ట్‌, వైరస్‌, వాతావరణంలో తేమ, కొన్ని రకాల ఆహార పదార్థాలు

లక్షనాలు: దగ్గు, ఆయాసం, ఛాతి బిగుతుగా ఉండడం, పిల్లికూతలు

డ్రగ్‌ అలర్జీ

కారకాలు: యాంటిబయాటిక్స్‌ (పెన్సిలిన్‌), పెయిన్‌ కిల్లర్స్‌

నిర్థారణ పరీక్షలు

ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు

బ్లడ్‌ టెస్ట్‌: సీరం lgE లెవెల్‌

స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌ (ఖ్కిఖీ): దీన్ని గోల్డ్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ అంటారు. ఇది కచ్చితమైన అలర్జీ నిర్థారణ పరీక్ష

చెస్ట్‌ ఎక్స్‌రే, పిఎన్‌ఎస్‌, లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ (PFT)

చికిత్సా విధానాలు

నిర్థారణ పరీక్షలు, లక్షణాల తీవ్రత, మెడికల్‌ హిస్టరీని బట్టి అలర్జీలకు సరైన చికిత్స ఎంచుకోవలసి ఉంటుంది. అలర్జీ కారకాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది.

యాంటీ హిస్టమైన్‌ మందులు

నేసల్‌ డీ కంజెస్టెంట్‌ స్ర్పేలు

బ్రాంకోడైలేటర్‌ మెడిసిన్‌, ఇన్‌హేలర్లు, నెబ్యులైజేషన్‌

ఇమ్యునోథెరపీ:

1) సబ్‌లింగ్యువల్‌ ఇమ్యునోథెరపీ- SLIT

(నాలుక అడుగున)

2) సబ్‌ క్యుటేనియస్‌ ఇమ్యునోథెరపీ - SCIT

(చర్మం అడుగున)

3) ఇది అత్యాధునికమైన, కచ్చితమైన చికిత్సా విధానం

యాంటీ lgE థెరపీ, అలర్జీ షార్ట్స్‌

నివారణ మార్గాలు:

అలర్జీ కారకాలకు (ట్రిగ్గర్స్‌) దూరంగా ఉండడం

అలర్జీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సూచించిన మందులను సరైన మోతాదులో, చెప్పినంత కాలం వాడుకుంటే, అలర్జీ నియంత్రణలోకి వస్తుంది.

సొంత వైద్యం మంచిది కాదు. దీంతో సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ ప్రతి సంవత్సరం డాక్టర్‌ సలహాతో తీసుకోవాలి.

డాక్టర్‌ నాగరాజు బోయిళ్ల,

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌,

పార్థీవ్‌ లంగ్‌ కేర్‌ సెంటర్‌,హైదరాబాద్‌.

ఫోన్‌ నెంబరు: 8886743444,

8886843444

Email:info@parthivlungcare.com

Updated Date - 2022-11-28T22:58:43+05:30 IST