‘శాండ్‌విచి’త్రం!

ABN , First Publish Date - 2022-07-11T03:09:19+05:30 IST

వెజ్‌ శాండ్‌విచ్‌, నాన్‌వెజ్‌ శాండ్‌విచ్‌... వంటి అనేక రకాలు రుచి చూసి ఉంటారు. కానీ ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఎప్పుడైనా ప్రయత్నించారా?

‘శాండ్‌విచి’త్రం!

వెజ్‌ శాండ్‌విచ్‌, నాన్‌వెజ్‌ శాండ్‌విచ్‌... వంటి అనేక రకాలు రుచి చూసి ఉంటారు. కానీ ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇటీవల కాలంలో ఫుడ్‌తో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. చూసే సినిమాలుగానీ, తినే ఆహారంగానీ ఏదో వెరైటీ లేకుండా యువతరం వాటివైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకే స్ట్రీట్‌ఫుడ్‌ వెండర్స్‌ నుంచి, స్టార్‌ హోటల్స్‌దాకా నిరంతరం ఏదో ఒక ప్రయోగం చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


గుజరాత్‌కు చెందిన ఒక వీధివ్యాపారి హృదయం ఆకారంలో సరికొత్త ‘శాండ్‌విచి’త్రాన్ని తయారుచేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. సాధారణంగా శాండ్‌విచ్‌ తయారీలో వెజిటబుల్స్‌, చీజ్‌, సాస్‌, బట్టర్‌ లాంటివి వాడుతారు. కానీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ‘హితేష్‌ శాండ్‌విచ్‌ స్టాల్‌’లో ఐస్‌క్రీమ్‌, చీజ్‌ను వాడి హృదయాకారంలో తయారుచేసిన శాండ్‌విచ్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో నోరూరిస్తోంది. బ్రెడ్‌ను హృదయాకారంలో కత్తిరించి దానిపై చీజ్‌ పూసి తర్వాత డైరీమిల్క్‌ చాక్లెట్‌ను తరిగి, చివర్లో చాకోబార్‌ ఐస్‌క్రీమ్‌ను రెండుగా చీల్చి, బ్రెడ్‌ మిశ్రమమంపై పెట్టి శాండ్‌విచ్‌ను సిద్ధం చేశాడు. కొందరు దీనిని ‘యమ్మీ’ అంటుంటే... మరికొందరేమో ‘కచ్చితంగా పిచ్చితనం’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఏదేమైతేనేం... వీడియోను చూస్తున్నవారి సంఖ్య అప్పుడే లక్షల్లోకి చేరింది. 

Read more