rebuild a broken relationship: విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలవాలంటే..

ABN , First Publish Date - 2022-11-23T14:35:42+05:30 IST

తిరిగి ప్రేమను పొందాలంటే కాస్త కష్టపడక తప్పదు.

rebuild a broken relationship: విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలవాలంటే..
relationship

ప్రేమలో ఉన్నప్పుడు కీచులాటలు, చిరుకోపాలు సర్వ సాధారణం.. ఒక్కోసారి ఇవి పెరిగి పెరిగి పెద్దవవుతాయి కూడా. ఇలాంటి సమయాల్లో ప్రేమికుల్లో పెరిగే దూరం మరింత బాధ కలిగిస్తుంది. తిరిగి ప్రేమను పొందాలంటే కాస్త కష్టపడక తప్పదు. ఇది అన్ని సంబంధాలపైనా ఈ సూత్రాలు పని చేయవు. వదులుకోకూడదనుకునే వ్యక్తులను దగ్గరచేసుకోవడం ఎలానో చూద్దాం.

1. మర్యాదపూర్వకంగా ఉండండి.

మాటలు తక్కువగా మాట్లాడే మీ భాగస్వామితో మాట్లాడటం మొదలు పెట్టండి. హాయ్ తో మొదలు పెట్టండి. ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే, ఇమెయిల్ పంపండి. అటువైపు నుంచి సమాధానం లేకపోతే వాళ్ళు ప్రతిస్పందించడానికి కొన్నిరోజులు వేచి ఉండండి తప్పులేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యా వచ్చిన దూరం సరికావడానికి వాళ్ళకు సమయాన్ని ఇవ్వండి. ఇలా మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారనే వార్త తెలిస్తే చాలు.

relationship-1.jpg

2. మెదడులో తుఫాను

కలిసి కూర్చుని, ఇద్దరూ మాట్లాడుకోండి. పెరిగిన దూరాన్ని తగ్గించుకోడానికి సరైన మార్గాన్ని కనిపెట్టండి. వీలైతే ఇద్దరి మధ్యలో గడిచిన కాలానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను తలుచుకోండి. అవి ఇప్పటి గాయాన్ని నయం చేయవచ్చు.

3. క్షమాపణ చెప్పండి

మాటలతో భాగస్వామిని బాధపెట్టినందుకు క్షమాపణ చెబితే, నిజాయితీగా క్షమాపణలు చెప్పండి. దూరం కావడానికి కారణమైన పద్దతిని మాటతీరును మళ్ళీ రిపీట్ చేయకండి.

4. సానుకూలంగా ఆలోచించండి

తెగిపోతుంది అనుకున్న సంబంధాన్ని సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పుడు కాస్త ఓపిక అవసరం. మనసు బాధపెట్టారని తెలిసి దానిని పూడ్చే ప్రయత్నం చేయాల్సింది కూడా మీరే.

Updated Date - 2022-11-23T14:43:25+05:30 IST