Not just size, but breech shape is also important : 'పుష్-అప్', 'డెమి' లేదా 'ప్లంజ్-స్టైల్', వక్షోజాలకు ఏ రకమైన బ్రా బాగా సరిపోతుంది?

ABN , First Publish Date - 2022-09-07T18:33:27+05:30 IST

మహిళలు ఎంపిక చేసుకునే దుస్తుల్లో ముఖ్యమైనది బ్రా ఇది సరిగ్గా ఫిట్ కాకపోతే ఎంత ఖరీదైన దుస్తుల్లోనైనా అందంగా కనిపించలేం.

Not just size, but breech shape is also important : 'పుష్-అప్', 'డెమి' లేదా 'ప్లంజ్-స్టైల్', వక్షోజాలకు ఏ రకమైన బ్రా బాగా సరిపోతుంది?

బ్రా సైజ్ ను ఎలా ఎంచుకుంటున్నారు. మహిళలు ఎంపిక చేసుకునే దుస్తుల్లో ముఖ్యమైనది బ్రా ఇది సరిగ్గా ఫిట్ కాకపోతే ఎంత ఖరీదైన దుస్తుల్లోనైనా అందంగా కనిపించలేం. వక్షోజాలకు సంబంధించి ఆడవారిలో ఎన్నో ప్రశ్నలుంటాయి. వక్షోజాల సైజును బట్టి ఎటువంటి బ్రాను ఎంచుకోవాలనే విషయంలో ఎప్పటికప్పుడు తికమకపడుతూనే ఉంటారు.


ఇతరుల ముందు కావాల్సిన బ్రా సైజ్ అడగాలన్నా సిగ్గు, బిడియం! దీంతో ఆన్లైన్ లో ఏదో నచ్చిన రంగును సెలక్ట్ చేసుకుని తీసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కంగారు పనులు అప్పటికప్పుడు సమస్యల్ని తీసుకురాకపోవచ్చు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జరిగే మార్పుల వల్ల వక్షోజాలలో నొప్పి, గడ్డలు రావడం, వక్షోజాలు సాగి కిందకు జారడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే బ్రాను కొనే ముందు అది మనకు సరిగ్గా సరిపోతుందా లేదా అనేది నిర్థారించుకున్నాకే తీసుకోవాలి. 


లోదుస్తులను కొనేముందు ముఖ్యంగా బ్రాను తీసుకునేముందు రెండు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

1. వక్షోజాల చుట్టు కొలత.

2. వక్షోజాల ఆకారం.

బ్రా విషయంలో వక్షోజాల ఆకారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వక్షోజాల ఆకారాన్ని బట్టి బ్రాని ఎంచుకోవడం కాస్త కష్టమే అయినా ఇది వక్షోజాలను ఎక్కువ కాలం షేప్ చెడిపోకుండా కాపాడుతుంది. 

మొదటిది పెండ్యులస్ బ్రెస్ట్.. ఇవి పొడవుగా దిగువకు వంగి ఉంటాయి. వీటి కోసం

1. పూర్తి కవరేజ్, 2. బాల్కోనెట్ బ్రాను ఎంచుకోవాలి. 

పూర్తి కవరేజ్ బ్రా ఇది వక్షోజాలను కప్పి ఉంచుతుంది.

బాల్కోనెట్ బ్రా ఇది వక్షోజాలను పైకి నెట్టి ఉంచుతుంది.

3. వక్షోజాలు రెండు వ్యతిరేక దిశలలో ఉన్నవారు ఫ్లంజ్ బ్రాని వాడాలి. 

4. కొద్దిగా పెద్ద సైజ్ వక్షోజాలు ఉన్నవారు సైడ్ షేపర్ వాడాలి.

5. బెల్ ఆకారం వక్షోజాలున్నవారు బాల్కనీ బ్రా, ప్లంజ్ స్టైల్ రెండిటినీ వాడవచ్చు.

6. అథ్లెటిక్ బ్రెస్ట్ ఉన్నవారు ప్లంజ్ బ్రా, పుష్ అప్ బ్రాను వాడవచ్చు.

7. గుండ్రని వక్షోజాలున్న వారు పూర్తి కవరేజ్ ప్లంజ్ బ్రాను వాడాలి.


బిడ్డకు తల్లయిన తరువాత పాలు ఇవ్వడంతో మామూలుగా వక్షోజాలు జారి ఉంటాయి ఇలాంటి వారు స్ప్లిట్ బ్రెస్ట్ ఉంటే డెమీ బ్రాను ఎంచుకోవడం మంచిది. ఇది పట్టి ఉండి వక్షోజాలను మంచి షేప్ తో చూపిస్తుంది.

Updated Date - 2022-09-07T18:33:27+05:30 IST