Navratri 2022: నవరాత్రి సమయంలో మీ ఆహారంలో ఈ 5 రుచికరమైన ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ ఉంటే..!

ABN , First Publish Date - 2022-09-26T15:38:51+05:30 IST

ఈ పండుగ సీజన్లో మనందరికీ ఎక్కడో ఒకచోట నుంచి ప్రసాదం అందుతూనే ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో చాలామంది కేవలం పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేస్తుంటారు.

Navratri 2022: నవరాత్రి సమయంలో మీ ఆహారంలో ఈ 5 రుచికరమైన ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ ఉంటే..!

పవిత్రమైన దసరా నవరాత్రుల సందర్భంగా వేడుకలు, ఉత్సవాలకు సన్నాహాలు మొదలవుతువున్నాయి. ఈ సంవత్సరం నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 4 వరకు జరుపుకుంటున్నారు. ఈ పండుగ సీజన్లో మనందరికీ ఎక్కడో ఒకచోట నుంచి ప్రసాదం అందుతూనే ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో చాలామంది కేవలం పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేస్తుంటారు. దీనికి అనువుగా ఈ తొమ్మిది రోజులూ నీరసం లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్ రిచ్ డైట్ ని ఫ్లాన్ చేసుకోండి. అదెలాగంటే...


ఉపవాసం సమయంలో బలహీనత లేకుండా ఉండేందుకు తప్పనిసరిగా ఐదు ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. 


పాల ఉత్పత్తులు..

పాలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే పదార్థం. ఈ ఉపవాసాల్లో పాల ఆధారిత పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. సోయా, జీడిపప్పు, బాదం పాలు, పనీర్, పెరుగు తీసుకోవడం మేలు చేస్తుంది.


బుక్వీట్.. 

కుట్టు, బుక్వీట్ పిండి పండ్ల విత్తనాలతో నుండి ఇది తయారవుతుంది. ఉపవాస సమయంలో దీనిని తింటారు. ఈ పిండి మంచి రుచితో గోధుమ పిండిలా ఉంటుంది. దీనికి జిగురు ఉండదు. బుక్వీట్ పిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఉపవాసం చేస్తున్నవారు సాంప్రదాయ ధాన్యాలను తీసుకోలేరు కాబట్టి, బుక్వీట్ ఆరోగ్యకరమైన పదార్థంగా  ఉపయోగపడుతుంది. కుట్టు పిండితో పూరీ, కుట్టు దోస కూడా తయారు చేసుకోవచ్చు.


సమక్ రైస్..

సమక్ రైస్ మనం వాడే సాధారణ బియ్యం కాదు. సమక్ బియ్యాన్ని పండ్లతో పాటు మనం తీసుకునే ఆహారంగా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ ప్రత్యేకమైన ధాన్యంలో చాలా ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి.


బాదం, గింజలు..

బాదంపప్పులలో అధిక ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి టీతోపాటు అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలను కూడా తీసుకోవచ్చు. ఇవి ఆకలిని మందగించేలా చేస్తాయి. చాలా సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ని ఇస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ నవరాత్రిలో ఉపవాసాలు చేసేవారంతా ఈ పదార్థాలను సిద్ధం చేసుకోండి మరి.

Read more