Bramostavalu 2022: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళుతున్నారా.. ఈ విషయం తెలుసా..?

ABN , First Publish Date - 2022-09-27T16:47:46+05:30 IST

లక్షలాది మంది భక్తులకు కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా, తిరుమాడవీధుల్లో తొమ్మిది రోజులు భక్తజన సంద్రాన్ని సమ్మోహనపరుస్తున్న..

Bramostavalu 2022: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళుతున్నారా.. ఈ విషయం తెలుసా..?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?


లక్షలాది మంది భక్తులకు కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా, తిరుమాడవీధుల్లో తొమ్మిది రోజులు భక్తజన సంద్రాన్ని సమ్మోహనపరుస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఈ ఉత్సవ వైభవానికి శ్రీకారం చుట్టినవారు ఎవరు? చరిత్రను పరిశోధిస్తే.. సుందరచోళపాండ్య రాజు చక్రవర్తిగా పరిపాలిస్తున్న కాలంలో క్రీ.శ. 966నాటికి తొండమండలంలో అంతర్భాగంగా ఉన్న ఉమ్మడి చిత్తూరు, ఉత్తర ఆర్కాడు, చెంగల్పట్లు జిల్లాలతో కూడిన ప్రాంతాన్ని కో-పార్ధివేంద్ర పాలించేవాడు. ఇతని ప్రధాన అనుచరుడు పల్లవ వంశీయుడు, స్థానిక అధికారి శక్తివిటంకన్‌. ఇతని భార్య సామవై. ఈ కాలంలో తిరుమల ఆలయంలో వేయబడిన రెండు శాసనాల్లో బ్రహ్మోత్సవానికి సంబంధించిన తొలి ప్రస్తావన ఉంది. అందులో అంకురార్పణ చిత్తా నక్షత్రంలో చేయాలని, తరువాత వచ్చే తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిగి పదవ రోజు శ్రవణ నక్షత్రంలో ఉత్సవాలు ముగించాలని ఉంది. అయితే చిత్తర నుంచి పదవ రోజు ఖచ్చితంగా శ్రవణం వచ్చే అవకాశాలు తక్కువ కనుక, సాధారణంగా హస్తా నక్షత్రంలో అంకురార్పణ జరుగుతూ వుంటుంది. ఈ ఏడాది కూడా సెప్టెంబరు 26వ తేదీన హస్తా నక్షత్రంలోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతున్నాయి.



ఈ విషయాలను పరిశీలించినపుడు తిరుమల ఆలయంలో తొలి బ్రహ్మోత్సవం ఏర్పాటు చేసిన సామవై రాణి అభీష్టం మేరకు అక్షయనామ సంవత్సరం అంటే 966వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన మంగళవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగి, పెరటాసి నెల 5వ తేదీ అంటే గురువారం ముగిసినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఈ సామవై వేయించిన రెండు శాసనాలే తిరుమల ఆలయానికి సంబంధించిన తొలి సమాచారం అందిస్తున్నాయి. ఈ శాసనాల్లోనే ఆమె ఆలయానికి, స్వామి సేవకు చేయించిన దాన వివరాలు కూడా ఉన్నాయి.

Updated Date - 2022-09-27T16:47:46+05:30 IST