Microsoft : మైక్రోసాఫ్ట్‌ ‘సూపర్‌ యాప్‌’

ABN , First Publish Date - 2022-12-10T00:04:29+05:30 IST

గూగుల్‌, యాపిల్‌కు దీటుగా ఎదిగేందుకు మైక్రోసాఫ్ట్‌ అడుగులు వేస్తోంది. కన్జూమర్‌ సర్వీసుల వైపు దూసుకువచ్చే యత్నంలో భాగంగా

Microsoft : మైక్రోసాఫ్ట్‌ ‘సూపర్‌ యాప్‌’

గూగుల్‌, యాపిల్‌కు దీటుగా ఎదిగేందుకు మైక్రోసాఫ్ట్‌ అడుగులు వేస్తోంది. కన్జూమర్‌ సర్వీసుల వైపు దూసుకువచ్చే యత్నంలో భాగంగా ‘సూపర్‌ యాప్‌’ నిర్మాణంలో ఉంది. షాపింగ్‌, మెసేజింగ్‌, వెబ్‌ సెర్చ్‌, న్యూస్‌ ఫీడ్స్‌ సహా పలు సర్వీసులు అన్నింటినీ ఈ సూపర్‌ యాప్‌లో కలిపేస్తోందని ‘ద ఇన్ఫర్మేషన్‌’ నివేదించింది. తద్వారా మల్టీబిలియన్‌ డాలర్ల వ్యాపారం చేయాలన్నది తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. టీమ్స్‌ మేసేజింగ్‌, ఇతర మొబైల్‌ సర్వీసులను కూడా ఆకట్టుకునే యత్నంలో మైక్రోసాఫ్ట్‌ ఉంది. గూగుల్‌, యాపిల్‌ మాదిరిగా యాప్‌ స్టోర్‌ని నిర్వహించటం లేదు. సేవలన్నింటిని కలిపి ఈ ఒక్క యాప్‌లోనే ఉంచనుంది. ఉదాహరణకు ఇది ‘వుయ్‌ చాట్‌’ మాదిరిగా సేవలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చనుంది. సూపర్‌ యాప్‌ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ‘యాక్టివిజన్‌ బ్లిజర్డ్‌’ను స్వాధీనం చేసుకున్న మైక్రోసాఫ్‌,్ట యూకే సహా మల్టిపుల్‌ మార్కెట్స్‌ వైపు దృష్టిసారించింది. ఈ క్రమంలో మొబైల్‌ గేమింగ్‌కూ వెళుతోంది.

Updated Date - 2022-12-10T00:04:30+05:30 IST