వేసవి ముగింపు... ఆవకాయతో పసందు!

ABN , First Publish Date - 2022-06-13T03:00:18+05:30 IST

వేసవి అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఆవకాయ పచ్చళ్లే. వేసవి ముగింపునకు వచ్చేసింది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆవకాయ పెట్టుకోకపోయి

వేసవి ముగింపు... ఆవకాయతో పసందు!

వేసవి అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఆవకాయ పచ్చళ్లే. వేసవి ముగింపునకు వచ్చేసింది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆవకాయ పెట్టుకోకపోయి ఉంటే మించిపోయిందేమీ లేదు. ఇది కూడా తగిన సమయమే.  దేశవ్యాప్తంగా విభిన్న రకాల పచ్చళ్లు పెడుతూ ఉంటారు. అయితే, దక్షిణ భారతదేశం, అందులోనూ తెలుగు రాష్ట్రాలు నోరూరించే ఆవకాయ పచ్చళ్లకు ప్రసిద్ధి. నోరూరించే ఈ పచ్చడిని చాలా కాలమే నిల్వ ఉంచుకోవాలని భావిస్తాం. అయితే, అంతమకుముందుగానే దానిని లాగించేస్తాం.


కొన్ని చిన్నచిన్న చిట్కాలతో ఆవకాయను మరింత రుచిగా చేసుకోవచ్చు. శనగపప్పు లాంటి సీక్రెట్‌ ఇంగ్రీడియెంట్‌తో కూడా ఆవకాయకు కొత్త రుచులను జోడించుకోవచ్చు. బెల్లం ఆవకాయ మరో వైవిధ్యమైన పచ్చడి. బెల్లం వల్ల తియ్యదనం, మామిడిలోని పుల్లదనం కలిసి అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే, బెల్లం నాణ్యత ఎంత బాగుంటే పచ్చడి అంత బాగుంటుంది. నువ్వు ఆవయకా పచ్చడని మరోటి ఉంటుంది. దీని రుచి కూడా అమోఘం. ఇక, అల్లం ఆవకాయ టేస్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పెరుగన్నంతో ఇది బెస్ట్ కాంబినేషన్. అలాగే, పల్లి ఆవకాయ  కూడా. కాకపోతే ఇది నిల్వ పచ్చడి కాదు. ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే ఓ వారం రోజులు వరకు వాడుకోవచ్చు. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలనుకునేవారు ఎండుమామిడి పచ్చడిని ప్రిఫర్ చేస్తారు. ఇక, ఇవి కాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ,  పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా  ఈ సీజన్‌లో ట్రై చేయొచ్చు.


పచ్చళ్లు సరే.. ఇవి ఎంత బాగా చేసిన అందులో నాణ్యమైన నూనె వాడకపోతే కష్టపడి పెట్టిన పచ్చి రుచి మారిపోయి తినడానికి పనికిరాకుండా పోతుంది. ఇదే విషయమై గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ.. చిన్నప్పుడు పచ్చడి వాసన చూసినప్పుడు ఎక్కడ లేని ఆనందం తొణికిసలాడేదని గుర్తు చేసుకున్నారు. నాటి రుచి ఇప్పటికీ ‘స్వాద్‌ జో జిందగీ సే జుడ్‌ జాయే లా ...’’లా గుర్తుండిపోయిందని అన్నారు.

Updated Date - 2022-06-13T03:00:18+05:30 IST